రేపు విడుదల కాబోతున్న ‘హైపర్’ సినిమాను  ప్రమోట్ చేస్తూ హీరో రామ్ ఒక మీడియా సమావేశంలో స్టార్ డమ్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు.  తాను చాలమందిలా స్టార్ డమ్ కోసం పైరవీలు చేయనని స్టార్ హీరో స్టేటస్ పై తనకు ఎటువంటి అభిరుచి కాని నమ్మకం కాని లేదు అంటూ వివదాస్పద వ్యాఖ్యలు చేసాడు రామ్.

అంతేకాదు తాను చేసే పనినే తాను నమ్ముతానని ఎప్పటికైనా కష్టపడి చేసే పని ద్వారానే ఏ వ్యక్తికైనా గుర్తింపు వస్తుంది. అయితే పైరవీలు చేస్తే శాస్వితమైన గుర్తింపు స్టార్ డమ్ లు వస్తాయి అనుకోవడం పొరపాటు అంటూ రామ్ చేసిన కామెంట్స్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి.

ఇదే సందర్భంలో రామ్ మాట్లాడుతూ తనకు ఎనర్జిటిక్ స్టార్ అన్న బిరుదు ఇవ్వడం నచ్చలేదు అంటూ మరో సంచలన కామెంట్ చేసాడు.    తన పేరు ముందు ఏ బిరుదూ అవసరం లేదని అంటున్నాడు ఈ యంగ్ హీరో.  కేవలం అభిమానుల కోసమే తప్పక టైటిల్స్ పడేటపుడు ‘ఎనర్జిటిక్ స్టార్’ అని వేయడానికి ఒప్పుకుంటున్నట్లు రామ్ చెప్పాడు. 

అయితే దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మాత్రం ఇదే మీడియా సమావేశంలో మాట్లాడుతూ రామ్ ను ఇప్పటి దాకా అందరూ ‘ఎనర్జిటిక్ స్టార్’ అన్నారని ‘హైపర్’ సినిమా తర్వాత రామ్ ని ‘హైపర్ స్టార్’ అని పిలుస్తారని అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు.  దీనితో ఒకవైపు రామ్ బిరుదులు వద్దు అంటూ ఉంటే సంతోష్ శ్రీనివాస్ రామ్ కు బిరుదుల సంఖ్య పెంచుతున్నాడు ఏమిటి అంటూ మీడియా వర్గాలు కామెంట్ చేసుకున్నట్లు టాక్.  

ఈ వార్తలు ఇలా ఉండగా రేపు విడుదల కాబోతున్న ‘హైపర్’ బిజినెస్ బాగా జరగడంతో ఈ సినిమా నిర్మాతలు మంచి జోష్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం ‘హైపర్’ ప్రీ రిలీజ్ బిజినెస్ 25 కోట్ల వరకు జరిగిన నేపధ్యంలో ఈసినిమా బయ్యర్లు లాభ పడాలి అంటే కనీసం ఈ సినిమాకు 30 కోట్ల కలక్షన్స్ రావాల్సిన పరిస్థుతులు ఏర్పడటంతో రామ్ సినిమాలకు అంత రేంజ్ ఉందా ? అన్న సెటైర్లు వినపడుతున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: