దర్శకుడుగా తన కెరియర్ మొదలు పెట్టి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడమే కాకుండా ఇప్పటి వరకు పరాజయం అన్న పదాన్ని ఎరుగని రాజమౌళికి ‘బాహుబలి 2’ తరువాత కొన్ని అనుకోని సమస్యలు ఏర్పడే సంకేతాలు కనిపిస్తున్నాయి అంటూ ఫిలింనగర్ లో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. అయితే ఇటువంటి షాకింగ్ న్యూస్ ప్రచారంలోకి రావడానికి ఒక కారణం ఉంది అని అంటున్నారు.

తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్ళిన రాజమౌళి ఘన విజయాల వెనుక ముగ్గురు కీలక పాత్ర ఉంది అన్నది వాస్తవం.  రాజమౌళి సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించే కెమెరామెన్ సెంథిల్ కుమార్, ఫైట్స్ కంపోజర్ పీటర్ హెయిన్స్ ల పాత్ర లేకుండా రాజమౌళి సినిమాలను ఊహించుకోలేము.

అయితే ఈ ముగ్గురు రాజమౌళి టీమ్ నుండి దూరం అయ్యే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి అని అంటున్నారు. ఇప్పటికే కీరవాణి రిటైర్మెంట్ డేట్ ప్రకటించిన నేపధ్యం తెలిసిందే. డిసెంబర్ 8, 2016 నుంచి సినిమాలకి దూరంగా వెళ్లిపోయి తనకు నచ్చిన జీవితం గడుపుతానని ఇప్పటికే రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే. 

ప్రస్తుతం ‘బాహుబలి 2’, ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమాలకు మాత్రమే పని చేస్తున్న కీరవాణి ఇక భవిష్యత్ లో తాను మరే సినిమాకు ఒప్పుకోను అని ఇప్పటికే స్పష్టంగా  చెపుతున్నట్లు టాక్.  దీనికితోడు రాజమౌళి దగ్గర పనిచేసే స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ ఇప్పటికే దర్శకత్వ బాధ్యతలు స్వీకరించాలని ఉత్సహపడుతున్నట్లు టాక్.  

రాజమౌళి సినిమాలకు గుండెకాయ లాంటి  కెమెరా మెన్ సెంథిల్ కుమార్ కూడా డైరెక్షన్ ఆలోచలో ఉన్నాడు అన్న ప్రచారం జరుగుతోంది.  వీరంతా ‘బాహుబలి 2’ తరువాత రాజమౌళి టీమ్ నుండి బయటకు వెళ్ళి పోవడం ఖాయం అన్న మాటలు చాల గట్టిగా వినిపిస్తున్నాయి.  

ఈ వార్తలే నిజం అయితే ఒక్కసారే రాజమౌళికి సీనియర్ సాంకేతిక నిపుణులు దూరమయ్యే పరిస్థుతులు ఏర్పడ బోతున్నాయి.  దీనితో ‘బాహుబలి 2’ తరువాత రాజమౌళి తీయబోయే సినిమాలకు మరో కొత్త టీమ్ ను ఏర్పరుచుకోవలసిన పరిస్థితి రాజమౌళికి ఎదురయ్యేలా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.  మరి ఈ అనుకోని సవాల్ ను రాజమౌళి ఎలా అధిగామిస్తాడో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: