ప్రస్తుతం ఉన్న డైరక్టర్స్ లో సుకుమార్ ఓ సెపరేట్ స్టైల్ అని చెప్పాలి.. తీసే ప్రతి సినిమా ఓ కొత్త టెక్నికల్ అడ్వాన్స్ తో సుకుమార్ తెలుగు పరిశ్రమకు ఓ మంచి దర్శకుడిగా పనిచేస్తున్నాడు. అలాంటి సుక్కు తనలోని ఓ భయాన్ని బయటపెట్టి అందరికి షాక్ ఇచ్చాడు. ఆర్య నుండి నాన్నకు ప్రేమతో వరకు సుకుమార్ సినిమాలు చూస్తే అందులో ఒకరిద్దరు తప్ప సీనియర్ ఆర్టిస్ట్ లు ఉండరు. 


అయితే దీనికి కారణం ఉందంటున్నాడు సుకుమార్. ఎన్నో సినిమాల అనుభవం ఉన్న నటులు తన దర్శకత్వం మీద ఏమన్నా మాట అంటారేమో అన్న భయం మీద తను సీనియర్ ఆర్టిస్ట్ లను తన సినిమాలో పెట్టుకోను అంటున్నాడు సుక్కు. ఇదో రకంగా సీనియర్ ఆర్టిస్ట్ పొట్టకొట్టే విధంగా ఉన్నా సుకుమార్ లోని ఈ భయం పోగొట్టుకోవాలని అనుకుంటున్నాడట.


యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో నాన్నకు ప్రేమతో అంటూ ఆడియెన్స్ ను ఎమోషనల్ బ్లాక్ మేల్ చేసిన సుక్కు ఇక ఇప్పుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో ఫార్ములా ఎక్స్ అంటూ ఓ పెద్ద ప్రయోగానికి గురి పెట్టాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా గురించి త్వరలో అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది. తన సినిమాలతో కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు ఎడ్యుకేషన్ కూడా అందిస్తున్న సుకుమార్ రాబోతున్న ఫార్ముల ఎక్స్ ను ఏ రేంజ్లో తెరకెక్కిస్తాడో చూడాలి.


ఇక చరణ్ కూడా ప్రస్తుతం చేస్తున్న ధ్రువ సినిమాను పూర్తి చేసుకుని సుకుమార్ సినిమాకు రెడీ అయ్యేందుకు సిద్ధమవుతున్నాడు. సుక్కు, చెర్రి ఓ డిఫరెంట్ అటెంప్ట్ గా ఆడియెన్స్ కు కొత్త అనుభూతిని కలిగించేందుకు ఈ సినిమా రాబోతుంది. మరి ఇద్దరు కలిసి ఆడియెన్స్ ను ఏ రేంజ్లో అలరిస్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: