తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు లవ్, గ్యాంగ్ స్టర్,మాఫియా చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ చిత్రాలు ఎప్పూడూ రోటీన్ గా ఉండటంతో జనాలు కూడా కొత్తదనం ఉన్న చిత్రాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. అది చిన్న చిత్రమే కావచ్చు..పెద్ద చిత్రమే కావచ్చు. కేవలం పెద్ద హీరో ఇమేజ్ తో నడుస్తుందన్న అపోహలు ఈ మద్య తొలగిపోయాయి. ఈ సంవత్సరం రిలీజ్ అయిన సర్ధార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం, రజినీ నటించిన కబాలి చిత్రాలు పెద్ద సక్సెస్ కాలేక పోయాయి.

OM NAMO VENKATESAYA location pics released

ఇక ఏమాత్రం స్టార్ హోదా లేని చిన్న చిత్రాలు పెళ్లి చూపులు, నాని నటించిన మజ్ను, కృష్ణగాడి వీర ప్రేమగాధ, జ్యో అచ్యూతానంద లాంటి చిత్రాలు మంచి విజయం సాధించాయి. అయితే గత కొంత కాలంగా ఇలాంటి సినిమాలకు విభిన్నంగా భక్తి రస చిత్రాలతో అద్భుత విజయాలు సాధిస్తున్న దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, అక్కినేని నాగార్జున ఇప్పటికే అన్నమయ్య,రామదాసు,షిరిడీసాయి లాంటి చిత్రాలు తీశారు.  తాజాగా వీరి కాంబినేషన్ లో మరో అద్భుతమైన చిత్రం రాబోతుంది.


వెంకటేశ్వర స్వామి మమా భక్తుడైన హథీరాంబాబా జీవిత నేపధ్యంతో ఈ చిత్రం రూపొందుతుంది.  ఈ చిత్రంలో శ్రీనివాసుడిగా టీవీ నటుడు సౌరభ నటిస్తోండగా, అనుష్క మహా భక్తురాలు కృష్ణమ్మగా కనిపించనుంది. ఇక నాగార్జున హథీరాంబాబా గా కనిపించనున్నారు. అన్న పూర్ణ స్టూడియోలో వేసిన ఆలయం సెట్టింగ్‌లో షూటింగ్ జరుగుతుండగా, తాజాగా లొకేషన్ లోని కొన్ని ఫోటోలను విడుదల చేశారు రాఘవేంద్రరావు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతమందిస్తున్నారు.  ఈ చిత్రంలో కథానాయికలుగా అనుష్క, ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: