మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ ఈ మూడు సినిమాలను పరిశీలిస్తే కొరటాల శివ తన మార్క్ ఏంటో తెలిసిపోతుంది. అయితే ఓ స్టార్ హీరో ఓ మంచి కంటెంట్ తో సినిమా తీస్తే ఏ రేంజ్ హిట్ సాధించవచ్చో సరిగ్గా ఈ మూడు సినిమాలతో ప్రూవ్ చేశాడు కొరటాల శివ. అయితే ఇప్పుడు తన దృష్టిలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఉన్నట్టు తెలుస్తుంది.


మహేష్ ను శ్రీమంతుడిగా.. తారక్ ను నేచర్ లవర్ గా చూపించిన కొరటాల శివ పవన్ కళ్యాన్ తో సినిమా తీస్తే అతన్ని ఏవిధంగా చూపిస్తాడు అన్న ఓ కొత్త ఆలోచన వచ్చింది. ఊరి దత్త తీసుకోవడం.. మొక్కలను ప్రేమించడం ఇవి కాకుండా ఈసారి ఏకంగా సమజాన్ని మార్చేసే ఏదైనా శక్తివంతమైన కథ ఉంటే అది కచ్చితంగా పవన్ కళ్యాన్ కు సరిపోతుంది.


ఇప్పటికే తన దగ్గర పది బౌండెడ్ స్క్రిప్ట్ అవి కూడా బ్లాక్ బస్టర్స్ అంటూ సవాల్ చేసిన కొరటాల శివ ఆ రాసుకున్న పదింటిలో మూడు పూర్తయ్యాయి మరి మిగిలి ఉన్న 7 కథల్లో అయినా పవన్ కు సూట్ అయ్యే కథ ఉందా అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే దాసరి పవన్ కళ్యాన్ ల కలయికలో ఓ సినిమా ఎనౌన్స్ చేశారు ఆ సినిమా దర్శకుల వేటలో కొరటాల శివ కూడా ఉన్నా కేవలం తన కథలను మాత్రమే డైరక్ట్ చేస్తా అనబట్టి ఆయన్ను పక్కకు పెట్టేశారు.


మరి కొరటాల తన కథతో పవన్ తో సినిమా తీస్తే ఎలా ఉంటుందో తెలియాలంటే అది కాంబినేషన్ కుదిరితేనే చెప్పగలం. ప్రస్తుతం జనతా గ్యారేజ్ హిట్ తో మరోసారి శ్రీమంతుడు సూపర్ స్టార్ మహేష్ తో జత కడుతున్న కొరటాల శివ మరో హిట్ సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: