తెలుగు బుల్లితెరపై మల్టీ టాలెంటెడ్ యాక్ట్సెస్ ప్లే బ్యాక్ సింగ్ సునిత మొట్ట మొదటి సారిగా నటిస్తున్న షార్ట్ ఫిలిమ్ ‘రాగం’ పోస్టర్ వచ్చేసింది. గతంలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అనామిక చిత్రం ద్వారా వెండి తెరపై కనిపించిన సునిత ఈ మద్య రాగం అనే షార్ట్ ఫిలింలో నటించింది.  వాస్తవానికి సునితకు ఇప్పటికే పలు ఆఫర్లు వచ్చినా నటనపై దృష్టి కేంద్రీకరంచలేదు. బుల్లితెరపై వ్యాఖ్యాతగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంది. ఈ షార్ట్ ఫిలంలో సునిత ఓ జర్నలిస్టుగా నటిస్తుంది. అంతే కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీయబోయే ఓ చిత్రంలో కూడా సునిత నటిస్తుంది.  
Image result for singer sunitha
టాలీవుడ్ లో అందం, అభినయం ఉన్న సునిత ఇప్పటి వరకు నటనపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. అంతే కాదు ఈ మద్య స్త్రీల సమస్యలపై పోరాటం చేయబోతున్న పాత్రలో నటించి మెప్పించేందుకు రెడీ అయింది. వాస్తవానికి ఆమె జీవితంలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ తన భర్తతో విభేదించి పిల్లలతో జీవిస్తున్న సునిత ఎప్పుడూ కూడా అధైర్యంగా కనిపించకపోవడం విశేషం. ఇక ‘రాగం’ పేరుతో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిలిం తన లైఫ్‌కి దగ్గరగా ఉంటుందని, అందువల్లే చాలా సీన్స్‌ను సింగిల్ టేక్‌లో చేశానని అంటోంది.
Image result for singer sunitha
అంతే కాదు షార్ట్ ఫిలిమ్ అయినప్పటికీ ఇందులో పాటలు ఉన్నాయని తెలిపింది. ఇక పెద్దగా అనుభవం లేకపోయినా సింగిల్ టేక్ లో చేశానని అంటుంది. ఈ చిత్రంలో ఎక్కువ శాతం మహిళలు ఉన్నట్లు తెలిపింది. అక్టోబర్ 1న రాగం ప్రీమియర్ షోని ప్రదర్శించనున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: