టాలీవుడ్ లో ఎప్పుడు హీరోయిన్స్ కొరత ఉండనే ఉంటుంది.. అందుకే హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా కాస్త చలాకిగా అనిపించిన భామలకు వరుస అవకాశాలిస్తారు. ప్రస్తుతం టాప్ రేంజ్లో ఉన్న రకుల్ తో పాటుగా కుర్ర హీరోలతో జబర్దస్త్ ఫాంలో ఉన్న రాశి ఖన్నా కూడా మంచి అవకాశాలని చేజిక్కించుకుంటుంది. హైపర్ అంటూ ఆడియెన్స్ ముందుకు రాబోతున్న రాశి ఖన్నా ఇప్పుడు మరో లక్కీ ఆఫర్ ను కొట్టేసింది.


ఎన్నాళ్ల నుండో వెయిట్ చేస్తున్న మాస్ మహరాజ్ రవితేజ తర్వాత మూవీ షురూ అయ్యింది. పవర్ సినిమాతో దర్శకుడిగా అవకాశం ఇచ్చిన బాబికి మరో అవకాశాన్నిస్తూ రవితేజ తన సినిమా త్వరలో స్టార్ట్ చేస్తున్నాడు. అసలైతే ఇప్పటికే ఓ సినిమా తీసి రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఉన్నా రెమ్యునరేషన్ గొడవలతో రవితేజ కాస్త వెనుకపడ్డాడు. ఈ సినిమా హీరోయిన్ గా రాశి ఖన్నాను సెలెక్ట్ చేశారట.


ఇప్పటికే బెంగాల్ టైగర్ తో జత కట్టిన ఈ ఇద్దరు ఇప్పుడు మరోసారి కలిసి నటించబోతున్నారు. పవర్ కన్నా ఇంకా పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో రాబోతున్న ఈ సినిమాతో దర్శకుడిగా బాబి.. హీరోగా మాస్ మహరాజ్ రవితేజ సత్తా చాటాలని చూస్తున్నారు. అయితే హైపర్ రాం, ఆక్సిజన్ తో గోపిచంద్ ఇద్దరికి ముందు సినిమాలు శివం,జిల్ ఫ్లాప్ ఇచ్చినా సరే వారు అవకాశాలిచ్చారు.


అయితే ఇప్పుడు రవితేజ కూడా రాశి లక్ తనకు కూడా కలిసిరావాలనే ఉద్దేశంతో హీరోయిన్ గా ఎవరిని  తీసుకుందామనే సెకండ్ ఆప్షన్ లేకుండా రాశి ఖన్నానే ఓకే చేశాడు. మరి క్రేజ్ కాంబోతో రాబోతున్న ఈ సినిమాలో రాశి ఖన్నా నటించడం అమ్మడికి ఓ హిట్ సినిమా ఎకౌంట్ లో పడ్డట్టే మరి రవితేజని బాబి ఏ రేంజ్లో చూపిస్తాడో సినిమా చూస్తేనే గాని చెప్పలేం.


మరింత సమాచారం తెలుసుకోండి: