గతకొంత కాలంగా ‘బాహుబలి 2’ నిర్మాణపు పనులలో బిజీగా ఉంటూ మీడియాకు చాలదూరంగా ఉంటున్న రాజమౌళి ఈరోజు సాయంత్రం ప్రభాస్ మరియు ఈసినిమా నిర్మాతలతో కలిసి మీడియా ముందుకు రాబోతున్నాడు.  అయితే ఇంత హడావిడిగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం వెనుక చాల వ్యూహాత్మక ఎత్తుగడలు ఉన్నాయి అన్న ప్రచారం జరుగుతోంది. 

కొంతకాలం క్రితం చైనాలో ‘బాహుబలి’ విడుదలవుతున్న సందర్భంగా చైనా నుండి వచ్చిన మీడియా ప్రతినిధులకు ‘బాహుబలి 2’ నిర్మాణం జరుగుతున్న సెట్ చూపెట్టడంతో పాటు ‘బాహుబలి 2’ విశేషాలను రాజమౌళి ఈసినిమా యూనిట్ సభ్యులతో కలిసి వివరించాడు.  ఈ విషయం తెలుగు మీడియా వర్గాల దృష్టికి వెళ్ళడంతో రాజమౌళికి జాతీయ అంతర్జాతీయ మీడియా అవసరాలు ఉన్నాయి కాని తెలుగు మీడియాను మర్చిపోయాడా అంటూ అప్పట్లో అతడి పై సెటైర్లు పడ్డాయి. 
 
‘బాహుబలి’ ఘన విజయానికి తెలుగు మీడియా ఎంతగా ప్రచారం ఇచ్చి సహకరించిందో తెలిసిన విషయమే అయినా గత కొంత కాలంగా రాజమౌళి తెలుగు మీడియాని పక్కకు పెట్టాడు అన్న కామెంట్స్ ఉన్నాయి.  దీనికితోడు ‘బాహుబలి 2’ మొదలు అయ్యాక  రాజమౌళి అధికారికంగా తెలుగు మీడియాకు ఈసినిమాకు సంబంధించి ఒక్క స్టిల్ కూడా ఇవ్వలేదు అన్న కోపం రాజమౌళి పై ఉంది అన్న వార్తలు ఇప్పటికే ఉన్నాయి.  

ఇప్పుడు ‘బాహుబలి 2’ నిర్మాణం ఇంచుమించు పూర్తి అయి ఈసినిమా మార్కెట్ గురించి రాజమౌళి ఆలోచించడం మొదలు పెట్టాడు.  ఇప్పటికే ఈసినిమా ఏరియా డిస్ట్రిబ్యూషన్ రెట్లు చుక్కలు అంటుతున్న నేపధ్యంలో మన తెలుగు రాష్టాల నుండి ఈసినిమాకు బయ్యర్లు క్యూ కట్టాలి అంటే  ‘బాహుబలి 2’ కు మళ్ళీ మీడియా పరంగా హైక్ రావాలి.

ఈవిషయాలు అన్నీ రాజమౌళికి ఒకేసారి గుర్తుకు రావడంతో ఇంత హడావిడిగా ఈరోజు మీడియా మీట్ ఏర్పాటు చేసారు అన్న వార్తలు వస్తున్నాయి.  అయితే ఈ మీడియా మీట్ కు ముందు కేవలం ఒకే ఒక్కరోజు గ్యాప్ తో ‘బాహుబలి 2’ కథ లీక్ అయింది అని వార్తలు రావడంతో పాటు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు వంటి అనేక ప్రశ్నలు కూడ ఈరోజు మీడియా సమావేశంలో రాజమౌళి ఎదుర్కొనబోతున్నాడు.  ఈసినిమాకు సంబంధించి బయ్యర్లలో ఉత్సాహాన్ని కలిగించడానికి ఈసినిమా విడుదల తేదేని ఈరోజు అధికారికంగా రాజమౌళి ప్రకటిస్తాడు అని వార్తలు వస్తున్నాయి.  

ఇది ఇలా ఉండగా మహేష్ మురగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పోకిరి’  సెంటిమెంట్ తో వచ్చే ఏడాది ఏప్రియల్ 28న విడుదల అవుతుంది అని వార్తలు కాస్తున్న నేపధ్యంలో ఎలర్ట్ అయిన రాజమౌళి తన ‘బాహుబలి 2’ రిలీజ్ డేట్ ను ఈరోజు ప్రకటించి మహేష్ ప్లాన్ కు చెక్ పెట్టే వ్యూహం కూడ ఈ ప్రెస్ మీట్ వెనుక ఉంది  అంటూ వార్తల హడావిడి చేస్తున్నాయి.  ఏమైనా ఈరోజు ప్రెస్ మీట్ లో ‘బాహుబలి 2’ విశేషాలు చాల భారీగా బయట పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.. 
.



మరింత సమాచారం తెలుసుకోండి: