గత కొంత కాలంగా మీడియాలో ఎక్కడ చూసినా నాగచైతన్య సమంతల జరగబోయే పెళ్ళి గురించి వార్తలే కనిపిస్తున్నాయి.  మధ్యమధ్యలో ఈ వార్తలకు అనేక ట్విస్టులు మరిన్ని ఊహాగానాలు తోడు అవుతూ ఉండటంతో మరింత సస్పెన్స్ థ్రిల్లర్ గా వీరి ప్రేమ పెళ్ళి వ్యవహారం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.  ఈ వార్తలు మొదలయ్యాక నాగచైతన్య ఈమధ్య ఎప్పుడూ ఏకాంతంగా మీడియా కెమెరాలకు దొరికింది లేదు.  

అయితే వచ్చే వారం ‘ప్రేమమ్’ విడుదల అవుతున్న సందర్బంగా చైతూ చాల చోట్ల మీడియాకు ఎదురు పడే అవకాశం ఉంది.  ఆ అవకాశాలు ఇంకా రాకుండానే నాగచైతన్య హాట్ యాంకర్ అనసూయకు పూర్తిగా దొరికి పోయాడు.  ఈ వీకెండ్ లో ప్రసారం కాబోతున్న ‘డేట్ విత్ అనసూయ’ కార్యక్రమంలో అనసూయ చైతన్యతో చాల మాటలు మాట్లాడించబోతోంది.

ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ఒకటి ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న ప్రముఖ ఛానల్ తరుచు ప్రసారం చేస్తూ ఉండటంతో అనసూయ తాను ఒగలు పోతూ అడిగే ప్రశ్నలతో చైతన్యను ఎలా ఇరికించింది అన్న ఆసక్తి అందరిలోనూ పెరిగి పోయింది.   దీనితో  అనసూయ ఈ డేట్ లో చైతూ చేత గుట్టంతా విప్పిస్తుందా ? అన్న ఆసక్తి అక్కినేని అభిమానుల్లో విపరీతంగా ఉంది.

చైతూ పెళ్ళయితే సమంతతో ఖరారైంది గానీ ఆ ప్రేమ వ్యవహారం ఎలా నడిచింది ? ఎన్ని ట్విస్ట్ లు ఉన్నాయి ?  సమంత మతం మారిందా ? లాంటి అనేక ప్రశ్నలు అనసూయ నాగాచైతన్యను అడుగుతుందేమో అన్న ఆశ అభిమానులలో ఉంది.  అయితే ఈ విషయాలు అన్నీ అనసూయ అడుగుతుందా ?  లేదంటే వచ్చే వారం విడుదల కాబోతున్న ‘ప్రేమమ్’ సినిమా గురించి ప్రశ్నలు అడిగి సరిపేడుతుందా అన్న అనుమానాల మధ్య అనసూయ డేట్ విత్ చైతూ ప్రసారం కాబోతోంది.  

ఇప్పటికే చాలామందితో మాటల డేటింగ్ చేసిన అనసూయ తన స్పీడ్ పెంచి చైతూతో చాల క్లోజ్ గా మూవ్ అవుతున్న ఈ ప్రోమోను చూస్తూ ఉంటే ఏవో కొన్ని సంచలనాలు ఈ కార్యక్రమంలో ఉండబోతున్నాయి అని అనిపించడం సహజం.  అయితే అనసూయ తన మాటల గారడీతో చైతన్య చేత ఏమి మాట్లాడించింది తెలియాలి అంటే రేపటి వరకు ఎదురు చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: