ఈరోజు హైదరాబాద్ నుంచి ప్రచురితం అయ్యే ఒక ప్రముఖ ఇంగ్లిష్ దినపత్రిక ‘మైండ్ యువర్ లాంగ్వేజ్’ అనే హెడ్డింగ్ తో ప్రచురించిన ఒక ఆ శక్తికర విశ్లేషణ నానీకి షాక్ ఇచ్చే విధంగా ఉంది.  చాలామంది టాప్ సెలెబ్రెటీలులా హీరో నాని కూడ బహిరంగ ఫంక్షన్స్ లో ద్వందార్ధాలు వచ్చే కామెంట్స్ చేస్తున్నాడు అంటూ నానీని టార్గెట్ చేస్తూ ఒక కథనాన్ని ప్రచురించింది.  

నానీ పై ఆ ఆంగ్ల దిన పత్రిక ఇలా కామెంట్ చేయడానికి వెనుక ఒక కారణం ఉంది.  ఈమధ్య జరిగిన ‘హైపర్’ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ లో నాని ఆరోజు ఆ ఫంక్షన్ కు అతిగా గ్లామర్ ఎక్స్ పోజ్ చేస్తూ వచ్చిన రాశి ఖన్నా పై కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేసాడు. 

‘రాశి నీవు చాల అందంగా కనిపిస్తున్నావు. అయితే ఇంతకు మించి పదాలు నీగురించి చెప్పాలి అని అనిపిస్తున్నా అవి నీట్ గా ఉండవు కాబట్టి చెప్పలేక పోతున్నాను.  అయితే ఈ ఫంక్షన్ కు వచ్చిన వారు అంతా నీవు ఎంత అందంగా కనిపిస్తున్నావు అని నీ వైపే చూస్తున్నారు’ అంటూ  రాశి ఖన్నా ఎక్స్ పోజింగ్ లుక్స్ పై జోక్ చేసాడు నాని.  ఈ కామెంట్స్ కు ఆ ఫంక్షన్ కు వచ్చిన వారంతా తెగ నవ్వుకున్నారు.

అయితే ఈ విషయాన్ని ఆ ధారంగా తీసుకుని టాలీవుడ్ సెలెబ్రెటీలు ద్వందార్ధాలతో బహిరంగంగా మాట్లాడుతున్న మాటలు ఎక్కువైపోయాయి అంటూ ఆ ఆంగ్ల దిన పత్రిక నాని కామెంట్స్ ను టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేసింది.  అంతేకాదు గతంలో బాలకృష్ణ – ఆలీ – రాజ్ తరుణ్ లాంటి సెలెబ్రెటీలు చేసిన ఇలాంటి ద్వందార్ధాల కామెంట్స్ వల మహిళలకు ఎంత అసౌకర్యంగా మారుతోందో వివరిస్తూ కొంత మంది మహిళల అభిప్రాయాలను కూడ ఆ పత్రిక ప్రచురించింది.

అయితే వివాదాలకు గాసిప్పులకు దూరంగా ఉండే నాని పై కూడ ఇటువంటి కామెంట్స్ రావడం ఆశ్చర్యం కలిగించే విషయమే అయినా వరస విజయాలతో దూసుకు పోతున్న నాని ఇటువంటి కామెంట్స్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్న సంకేతాలు ఆ పత్రిక కథనం నానీకి ఇచ్చింది అని అనుకోవాలి. ఏమైనా రానున్న రోజులలో సెలెబ్రెటీలు బహిరంగ సమావేశాలలో మాట్లాడుతున్నప్పుడు తమ నోటిని అదుపులో ఉంచుకాకపోతే ఇలాంటి కష్టాలే వస్తాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: