తెలుగు ఇండస్ట్రీలో లక్ష్మీ కళ్యానం చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన కలువు కళ్ల భామ కాజల్ తర్వాత టాలీవుడ్ అగ్ర హీరోల సరసన వచ్చి నెంబర్ వన్ హీరోయిన్ రేసులోకి వెళ్లింది.  ఇక రాజమౌళి దర్శకత్వం వహించిన ‘మగధీర’ చిత్రంతో మిత్రవింద పాత్రతో కాజల్ ఒక్కసారే స్టార్ డమ్ పెరిగిపోయింది.  ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా సత్తా చాటింది.  ఈ అమ్మడు మెగా టాప్ హీరోలందరితో నటించింది..నటిస్తుంది.  రాంచరణ్, అల్లు అర్జున్,పవన్ కళ్యాన్ తాజాగా ఖైదీ నెం. 150 చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన కూడా నటిస్తుంది. గత సంవత్సరం టెంపర్ చిత్రం తర్వాత కాజల్ తెలుగు లో సినిమాలు తగ్గాయన్న సమయంలో సర్ధార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం చిత్రాల్లో చాన్స్ వచ్చినా..అవి కాస్త భారీ డిజాస్టర్ గా మిగిలిపోయాయి.
Image result
ప్రస్తుతం ఈ అమ్మడు రూట్ మార్చి కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఐటమ్ సాంగ్ లో నటించి అందరి చూపు తనవైపు తిప్పుకుంది. దీంతో కాజల్ దశ ఒక్కసారే తిరిగిపోయింది. ఈ అమ్మడికి తిరిగి మళ్లీ చాన్సులు రావడం మొదలయ్యాయి. అంతే కాదు సంక్రాంతికి లేదా సమ్మర్ సీజన్ లో మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం.150 చిత్రం గనక సూపర్ హిట్ అయితే కాజల్ పొజీషన్ పూర్తిగా మారినట్లే.. మరో వైపు త‌మిళ్ లో అజిత్ తో ఒక సినిమాకి కమిట్ అయిన కాజ‌ల్ డేట్స్ ఎడ్జెస్ట్ చేయ‌లేక విక్రమ్ సినిమా ఒదులుకుంది.
Image result for kajal
ఇక తుపాకి, జిల్లా సినిమాల త‌ర్వాత విజ‌య్ తో మూడోసారి న‌టించ‌డానికి సిద్ధ‌ప‌డుతోంది.  విజ‌య్ న‌టించ‌బోయే 61వ సినిమాకి క‌థానాయిక‌గా కాజ‌లు పేరు మారు మోగుతోంది. దీనికి క‌థ విజయేంద్ర ప్ర‌సాద్ అందిస్తుండ‌గా అట్లీ డైరెక్ట్ చేస్తున్నాడు. లుగు లో మెగా స్టార్ తో న‌టిస్తూ త‌న డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో తెలియ‌చెబుతోంది కాజ‌ల్.


మరింత సమాచారం తెలుసుకోండి: