కింగ్ నాగార్జున ప్రస్థానంలో ఎప్పుడు కొత్తదనం కోసం ఉరకలు వేస్తుంటాడు. ఇప్పటి స్టార్ హీరోలకు ధీటుగా 50 కోట్ల మార్కెట్ ను అవలీలగా చేజ్ చేసిన నాగ్ ఇక ప్రయోగాలకు పెద్ద పీఠ వేస్తున్నాడు. ఊపిరిలో సినిమా మొత్తం వీల్ చైర్ లో నడిపించేసిన నాగార్జున ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నట్టు టాక్. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించి సూపర్ హిట్ కొట్టిన సినిమా ఒప్పం. ప్రియ దర్శన్ రామ్ డైరక్ట్ చేసిన ఈ మూవే రిలీజ్ అయిన మూడు వారాల్లో 27 కోట్లకు పైగా కలక్షన్స్ సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. 


అయితే ఆ సినిమా రీమేక్ ను తెలుగులో నాగార్జునతో చేయించాలని చూస్తున్నారు. హిట్ సినిమా కదా నాగార్జున తప్పకుండా చేస్తాడులే అంటే ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే ఆ సినిమాలో మోహన్ లాల్ గుడ్డివాడిగా నటించాడు. ఓ లిఫ్ట్ ఆపరేటర్ గా పనిచేసే తను అదే అపార్ట్మెంట్ లో జరిగిన హత్య చేసిన కిల్లర్ ను ఎలా పట్టుకున్నాడనేదే కథ. సినిమా మొత్తం మోహన్ లాల్ బ్లైండ్ మ్యాన్ గా నటించి మెప్పించాడు. 


మరి నాగార్జున కూడా అలా గుడ్డి వాడిలా నటించడానికి సాహసం చేస్తాడా అన్నది ఇప్పుడు ముందున్న ప్రశ్న. దర్శక నిర్మాతలైతే నాగార్జున ఒప్పుకుంటే ఒప్పం తెలుగు రీమేక్ చేసేద్దామనే ఆలోచనలో ఉన్నారు ఒకవేళ అలా కుదరకపోతే ఒప్పం తెలుగు డబ్ చేసి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. నాగార్జున నిర్ణయం మీదే ఆ సినిమా తెలుగు రీమేక్ ఆధారపడి ఉంది.


మనమంతా, జనతా గ్యారేజ్ సినిమాలతో తెలుగులో మంచి స్కోప్ ఏర్పరచుకున్న మోహన్ లాల్ ఇకనుండి తెలుగు మార్కెట్ మీద కూడా ఓ దృష్టి పెట్టనున్నారు. నాగార్జున ఒప్పుకుని చేస్తే ఓకే లేదంటే మలయాళ ఒప్పం సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు మోహన్ లాల్.


మరింత సమాచారం తెలుసుకోండి: