తెలుగు ఇండస్ట్రీలోకి ‘దేవదాసు’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో మొదటి చిత్రంతోనే డ్యాన్స్, ఫైట్స్ తో దుమ్ము దులిపాడు. ఆ తర్వతా వచ్చిన సినిమాలు పెద్దగా ఆకర్శించకపోయినా..‘రెడీ’ చిత్రంతో మంచి విజయం సాధించాడు. ఆ మద్య విడుదలైన పండగ చేస్కో, నేనూ శైలజ లాంటి చిత్రాలతో హిట్స్ అందుకున్న రామ్ తాజాగా ‘హైపర్ ’ చిత్రంతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  ఫస్టాఫ్ ముగిసే సమయానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది . ఫస్టాఫ్ వినోదభరితంగా ఉందని మాస్ ప్రేక్షకులకు నచ్చడం ఖాయమని అంటున్నారు అయితే సెకండాఫ్ అయితే కానీ అసలు రిజల్ట్ విషయానికి వస్తే కాస్త ఎమోషన్స్ తో పాటు మొత్తం రివేంజ్, చాలేంజ్ సీన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. సినిమా తండ్రి సెంటిమెంట్ చాలా ఉందని ప్రమో,ట్రైలర్స్ లో చూపించారు.
Image result for hyper movie
అయితే ఆ సెంటిమెంట్ పక్కకు పెడితే ఎప్పటిలాగే రామ్  వాయిలెంట్ ఎక్కువ చూపించారు. తండ్రిని ఎంతగానో ప్రేమించే  హీరో నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, గజ అన్న రౌడీతో హీరో ఫ్రెండ్‌షిప్ ఇలా వీటన్నింటినీ ఒక కొత్తదనమున్న స్క్రీన్‍ప్లేతో చెప్పిన విధానం కాస్త బాగానే అనిపించింది. మొదట్నుంచీ చివరివరకూ కామెడీ ఎక్కడా తగ్గకుండా చూసుకోవడం కూడా బాగుంది. ఈ కామెడీ కూడా స్పెషల్ గా క్రియేట్ చేయకుండా స్టోరీలోనే కొనసాగడం చాలా బాగుంది. ఇక హీరో హీరోయిన్ ల మద్య వచ్చే సన్నివేశాలు..లవ్ ట్రాక్ కూడా కాస్త సిల్లీగా కనిపించింది.
Image result for hyper movie
ఇక పాటల విషయానికి వస్తే సినిమాలో పాటలు కూడా పెద్దగా ఆకర్షించలేక పోయాయి. హైపర్’కథ కాస్త పాతదే అయినా దానికి తండ్రంటే విపరీతమైన ప్రేమ ఉండే హీరో క్యారెక్టరైజేషన్‌ను జోడించి కామెడీ తగ్గకుండా, కథలోని ఎమోషన్‌ను చివరివరకూ కొనసాగిస్తూ అల్లిన స్క్రీన్ ప్లే  ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. మొత్తానికి ఈ సినామాపై మిశ్రమ స్పందనే వస్తుంది మరి రేపటి వరకు తీర్పు ఎలా ఉంటుందో కలెక్షన్లు ఎలా వస్తాయో వేచి చూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: