ప్రిన్స్ మహేష్ బాబు తో సినిమాలు తీస్తున్న నిర్మాతలు మహేష్ స్టామినాకు మించి ఖర్చులు పెడుతూ పరోక్షoగా మహేష్ కెరియర్ హానిచేస్తున్నారు కొందరు విమర్శకులు ఒక సరి కొత్త విషయాలను తెర పైకి తీసుకు వస్తున్నారు. వీరు ఇలా కామెంట్ చేయడానికి మహేష్ లేటెస్ట్ సినిమాల వ్యవహార శైలి అని అంటున్నారు. 

‘జనతా గ్యారేజ్’ సూపర్ సక్సస్ తరువాత కొరటాల శివ మహేష్ తో డి.వి.వి. దానయ్య నిర్మాతగా ఒక సినిమాను  తీస్తున్న విషయం తెలిసిందే.  ‘నిన్ను నువ్వు తెలుసుకో’ అనే రామకృష్ణ పరమహంస మాటలలోని సారంశాన్ని కథగా మార్చి కొరటాల శివ తీస్తున్న ఈ లేటెస్ట్ మూవీలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు అన్న వార్తలు ఇప్పటికే ఉన్నాయి. 

ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే సంవత్సరం జనవరి నుంచి ప్రారంభం అవుతుంది అన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా ఇంకా ప్రారంభం కాకుండానే ఈ మూవీకి ఏర్పడ్డ ౩9 కోట్ల సమస్య టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 

ఫిలింనగర్ లో  వినపడుతున్న వార్తల ప్రకారం ఈ సినిమాకు మహేష్ 25 కోట్ల భారీ పారితోషికాన్ని తీసుకుంటూ ఉంటే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న కొరటాల శివకు 14 కోట్ల పారితోషికం ఇస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఈ సినిమాకు వచ్చే లాభాలలో  అటు మహేష్ కు ఇటు కొరటాల శివకు కొంత షేర్ ఇస్తున్నారు అన్న వార్తల ప్రచారం కూడ జరుగుతోంది.

ఇవన్ని లెక్కలోకి తీసికుంటే కేవలం ఈ మూవీ బడ్జెట్ లో 39 కోట్లు మహేష్ కొరటాలలకే సరిపోతూ ఉంటే ఈ మూవీ బడ్జెట్ 100 కోట్లకు చేరిపోయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.  కేవలం మహేష్ కొరటాలల స్టామినాను నమ్ముకుని ఈ సినిమా నిర్మాతలు చేస్తున్న సాహసం టాలీవుడ్ విశ్లేషకుల లెక్కలకు కూడ అందటం లేదు అని టాక్.   ఈ వార్తలు ఇలా ఉండగా మురుగ‌దాస్ – మ‌హేష్ బాబు కాంబినేష‌న్‌లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ సినిమాకు సంబంధించి మరిక ఆ శక్తికర విషయం బయటకు వచ్చింది.  

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా కోసం ఓ యాక్ష‌న్ స‌న్నివేశానికి సంభందించిన ఫైట్ కు  3 కోట్లు ఖర్చు పెడుతూ ఉండటం మరింత సంచలనంగా మారింది.. ఈ యాక్ష‌న్ సీన్‌లో కార్ ఛేజింగులు, బోట్ డ్రైవింగులూ. కల‌గ‌లిపి హాలీవుడ్ స్థాయిలో స్టంట్ ను మురగదాస్ కంపోజ్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ యాక్షన్ సీన్స్ కంపోజింగ్ కోసం హాలీవుడ్ నుంచి కొంతమంది ఫైట్ కంపోజర్స్ ను పిలిపించ బోతున్నట్లు టాక్.   ఈ ఒక్క ఫైట్ సీన్ కోస‌మే 12 రోజులు కాల్షీట్లు మహేష్ నుంచి తీసుకున్నారు అన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో మహేష్ సినిమా లపై నిర్మాతలు పెడుతున్న ఖర్చులు టాలీవుడ్ అంచనాలకు అందడం లేదు అన్న కామెంట్స్ వినపడుతున్నాయి.  కేవలం మహేష్ స్టామినాను ఆధారంగా చేసుకుని ఈ రెండు సినిమాలకు సంబంధించిన నిర్మాతలు పెడుతున్న ఖర్చు తలలు పండిన వారికి కూడ అర్ధం కాని పజిల్ గా మారిందని ఘాటైన కామెంట్స్ వినిపిస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: