నిన్నరాత్రి మీడియా ముందుకు వచ్చి ‘బాహుబలి 2’  విశేషాలను వివరించిన రాజమౌళి తన మాటల మధ్య ప్రభాస్ కు సంబంధించి ఒక బిగ్ సర్ప్రైజ్ రాబోతున్న అక్టోబర్ 5న చెప్పబోతున్నాను  అంటూ ఒక గెస్సింగ్  గేమ్ కు తెర తీసాడు. ఈ మీడియా మీట్ కు వచ్చిన మీడియా వర్గాలు తమ తెలివి తేటలతో రాజమౌళి నుంచి ప్రభాస్ కు సంబంధించిన   రహస్యాన్ని బయట పెడదామని ప్రయత్నించినా రాజమౌళి ఎంతో వ్యూహాత్మకంగా ప్రభాస్ కు సంబంధించి తాను  ఆడుతున్న గెస్సింగ్ గేమ్ ను చాలా తెలివిగా కొనసాగించాడు. 

దీనితో రాజమౌళి ప్రభాస్ కు సంబంధించి ఈ నెల 5వ తారీఖున చెప్పబోయే విషయం గురించి మీడియా వర్గాలలో కూడ అంచనాలు మొదలు అయ్యాయి.  ప్రభాస్ ఒక ఇంటర్ నేషనల్ సిరీస్ లో నటించ బోతున్నాడు అంటూ కొందరు ఊహిస్తే మరికొందరు ప్రభాస్ నటించబోయే ఒక హాలీవుడ్ సినిమాకు సంసంబంధించి ఒక ప్రకటన రాబోతోంది అంటూ మరికొందరు ఊహించుకున్నారు.  

మరికొందరు  మీడియా ఆ ప్రతినిధులు అయితే  ప్రభాస్ ‘సింగం3’ లో ఒక ప్రత్యేక పాత్రను చేయబోతున్నాడు అంటూ ఊహా గానాలు చేసారు. దీనితో రాజమౌళి తన తెలివి తేటలతో ఏకంగా మీడియా వర్గాలతోనే గేమ్ మొదలు పెట్టాడు అంటూ కామెంట్స్ మొదలు అయ్యాయి. 
 
ఇదే సందర్భంలో రాజమౌళి మాట్లాడుతూ కార్టూన్ ఫిల్మ్ ల మాదిరిగా రాబోతున్న ‘బాహుబలి’  ఏనిమేటెడ్ సిరీస్ కథ వేరు అని  దానికి ‘బాహుబలి’ సినిమా కథకు సంబంధం ఉండదు అంటూ మరో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు.  అయితే తాను ఉన్నా లేకున్నా కూడా ‘బాహుబలి’ సిరీస్ కంటిన్యూ కావాలన్నది తన కోరిక అంటూ ‘బాహుబలి’ ని ఒక బ్రాండ్ గా మార బోతోంది అన్న సంకేతాలు ఇచ్చాడు రాజమౌళి.  

బాహుబలి పార్ట్ 2 సినిమాకు సంబంధించినంత వరకు అందరు నటులు కూడా డిసెంబర్ తో ఫ్రీ అయిపోతారని  చెపుతూ ‘బాహుబలి 2’ సినిమాను ఒక నెల ముందుగానే వర్చ్యువల్ రియాల్టీ ఫార్మ్ లో విడుదల చేస్తానని చెపుతూ దానికోసం థియేటర్ల దగ్గర గూగుల్ కార్డ్ బాక్స్ ల ఏర్పాటు చేయ బోతున్నట్లు రాజమౌళి ప్రకటించడం బట్టి రాజమౌళి ‘బాహుబలి 2’  విషయంలో చాలా భారీ ప్రణాళికలతో బయటకు చెప్పక పోయినా ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్ల కలెక్షన్స్ పై కన్ను వేసాడు అన్న సంకేతాలు ఇస్తున్నాడు.

ఏది ఏమైనా నిన్నటిరోజు జరిగిన ప్రెస్ మీట్ తో రాజమౌళి ‘బాహుబలి 2’ కి సంబంధించిన అనేక విషయాలకు క్లారిటీ ఇవ్వడమే కాకుండా ‘బహుబలి’ ని ఒక సినిమాలా కాకుండా ఒక బ్రాండ్ గా మార్చడానికి తాను  చేయబోతున్న విషయాల పై చాలా స్పష్ట త ఇచ్చాడు రాజమౌళి..  



మరింత సమాచారం తెలుసుకోండి: