'బాహుబలి 2' సినిమాను సరికొత్తగా చూపిస్తామని ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెలిపాడు. హైదరాబాదులోని దసపల్లా హోటల్ లో 'బాహుబలి 2 కన్ క్లూజన్' లోగోను  నిన్న సాయంకాలం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వర్చువల్ రియాలిటీ విధానంలో 'బాహుబలి 2' సినిమాను చూపించనున్నామని చెప్పారు. ఎంతోమంది శ్రమతో ఆవిష్కృతమైన ‘బాహుబలి’ ప్రపంచం ఎప్పటికీ ఆగకూడదనేదే మా ఉద్దేశం’’ అన్నారు దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ‘బాహుబలి - ది బిగినింగ్‌’తో ప్రపంచానికి ఓ కొత్త రాజ్యాన్ని పరిచయం చేసిన ఆయన ప్రస్తుతం దానికి కొనసాగింపుగా ‘బాహుబలి- ది కన్‌క్లూజన్‌’ తెరకెక్కిస్తున్నారు.


Image result for bahubali

ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. రెండు పాటలు, కొన్ని సన్నివేశాలు మినహా చిత్రీకరణ పూర్తయింది. ఈ కామిక్ సిరీస్ కు, 'బాహుబలి' సినిమాకు సంబంధం లేదని, గ్రాఫిక్ ఇండియా అనే సంస్థ కామిక్ సిరీస్ ను రన్ చేస్తుందని ఆయన చెప్పారు. దీనికి కేవలం 'బాహుబలి' క్రేజ్ ను మాత్రమే వాడుకుంటారని, కథ, గ్రాఫిక్స్, కథనం, పాత్రలు ఇలా ప్రతి విషయం వారే చూసుకుంటారని రాజమౌళి తెలిపారు. ఈ కామిక్ ప్రాజెక్టుకు తనకు పెద్దగా సంబంధాలు ఉండవని ఆయన చెప్పారు. కావాలంటే సలహాలు ఇస్తానని ఆయన చెప్పారు. 


Image result for bahubali team

'వర్చువల్ రియాలిటీ' విధానంలో చూపించేందుకు 25 కోట్ల రూపాయలు ఖర్చుచేసి 300 థియేటర్లలో వర్చువల్ డివైస్ ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలిపారు. ఈ వర్చువల్ గాగుల్స్ ఒక్కొక్కటి సుమారు 2 లక్షల రూపాయల ఖరీదు ఉంటుందని రాజమౌళి తెలిపారు. ఖరీదైన కంప్యూటర్లలో ఈ డివైజ్ ఉంటుందని ఆయన చెప్పారు. 'బాహుబలి2'ను ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ఆయన అన్నారు. జనవరిలో 'బాహుబలి' ట్రైలర్ ను విడుదల చేస్తామని ఆయన చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: