సెల్ఫీ.. సెల్పీ.. స్మార్ట్ ఫోన్లు వచ్చాక.. ఈ సెల్ఫీ మత్తుకు యావత్ యువత బానిసలవుతోంది. గుడి, బడి అనేది లేదు ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీ తీసుకోవడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం స్మార్ట్ ఫోన్ యూజర్లకు అలవాటైంది. ఇక ఫంక్షన్లు,  సెలబ్రిటీల విషయంలో సెల్ఫీ పిచ్చి పరాకాష్టకు చేరుతుంది. అభిమాన నటుడు లేదా నటి కనిపించగానే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరచిపోయి వారి వెంట పడతారు. సహనం నశించిన కొందరు సెలబ్రిటీలు ఫోటోల కోసం ఎగబడిన వాళ్లను కాళ్లతో తన్నడం, బూతులు తిట్టడం మనం వింటున్నాం, కంటున్నాం.


బాలీవుడ్ మిస్టర్ కూల్ గా పిలవబడే జన్ అబ్రహంకి సెల్ఫీ... విపరీతమైన కోపాన్ని తెప్పించింది. అభిమానులు ఎన్ని వెర్రివేషాలు వేసినా చిరునవ్వు చిందించే జాన్.. ఓ అభిమానిపై చెయి చేసుకున్నాడంట. అంతే కాదు.. అది టెలీకాస్ట్ చేయవద్దని జర్నలిస్టులకు వార్నింగ్ కూడా ఇచ్చాడంట. 


జాన్ క్రేజీయెస్ట్ సినిమా ఫోస్ కి స్వీకెల్ గా వచ్చిన ఫోర్స్ -2 ట్రైలర్ సెప్టెంబర్ 29 గురువారం రోజున లాంచ్ అయింది. ఈ కార్యక్రమం ముగిశాక.. జాన్ చుట్టూ అభిమానులు గుమిగూడారు. సెల్ఫీ కోసం ఒకరినొకరు తోసుకున్నారు. ఈ తోపులాటలో జాన్ కిందపడబోయి.. నిలదొక్కుకున్నాడట. చివరికి ఎలాగోలా వారి నుండి తప్పించుకుని.. బయటకు వెళ్లబోతుండగా.. ఓ అభిమాని జాన్ చేయి పట్టుకుని వెనక్కు లాగి సెల్ఫీ తీసుకోబోయాడట. దీంతో జాన్ ను చిర్రెత్తుకొచ్చి ఆ అభిమాని గూబ గుయ్య్ మనిపించాడట. అంతే కాదు ఈ ఘటనను కవర్ చేయవద్దని జర్నలిస్టులకు వార్నింగ్ కూడా ఇచ్చాడట.


ఏమీ లేకుండానే.. నానా హంగామా చేసే మీడియా.. వార్నింగ్ ఇస్తే ఊరుకుంటుందా. ఓ రోజంతా జాన్ దురుసుతనంపైనే ఛానళ్లు వార్తలను ప్రసారం చేశాయి. అయితే జాన్.. మీడియా చేస్తున్న హడావుడిపై మండిపడ్డాడు. తనపై ప్రసారం చేసిన కథనాలను ఖండించాడు. అంతే కాదు.. తమ హీరో ఎవరిపై చేయి చేసుకోలేదని, అనుకోకుండా జరిగిన సంఘటనపై మీడియా రాద్ధాంతం చేస్తోందని తన ప్రతినిధులతో ప్రకటన ఇప్పించాడు. మరోవైపు హీరో చేత గూబగుయ్య్ మనిపించుకున్న అభిమాని.. జాన్ ఇంటికి వచ్చి మరీ క్షమాపణలు కోరడం ఆసక్తికర విషయం.


మరింత సమాచారం తెలుసుకోండి: