తెలుగు ఇండస్ట్రీలో వారసత్వపు హీరోగా వచ్చిన వారిలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. పెద్దనాన్న అయిన రెబల్ స్టార్ కృష్ణం రాజు కి నటవారసుడిగా ‘ఈశ్వర్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ మొదటి సినిమాతోనే తన మాస్ జోష్ చూపించాడు.  తర్వాత వచ్చిన చిత్రాలు పెద్దగా విజయం సాధించకపోయినా..జక్కన చెక్కిన చత్రపతితో ప్రభాస్ కి ఒక్కసారే స్టార్ ఇమేజ్ పెరిగిపోయింది. అప్పటి నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు..మిస్టర్ పర్ఫెక్ట్,డార్లింగ్,మిర్చిలాంటి బ్లాక్ బ్లస్టర్ చిత్రాల్లో నటించారు. గత సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా తెలుగోడి సత్తా చాటిన చిత్రం ‘బాహుబలి’.
Image result for prabhas baahubali logo
ఈ చిత్రం కోసం ప్రభాస్ దాదాపు రెండు సంవత్సరాలు ఎంతో కష్టపడి నటించారు..ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్ షరవేగంగా జరుపుకుంటుంది.  అయితే బాహుబలి చిత్రం షూటింగ్ సమయంలో పెళ్లి చేసుకోకుండా కేవలం సినిమాకు మాత్రమే తన టైమ్ కేటాయించారు..ఈ సినిమా తర్వాత ఇప్పుడు బాహుబలి 2 చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రం పూర్తి కాగానా ప్రభాస్ ఇంట పెళ్లి భాజా మోగుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ప్రభాస్ ఈ నెల 5న ఓ సంచలన ప్రకటన చేయబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Image result for prabhas bahubali 2 logo
అయితే ఇది తప్పకుండా పెళ్లి వార్తే అయి ఉంటుందని అందరూ భావిస్తున్నారు..మరోవైపు ప్రభాస్ చెప్పబోయే న్యూస్ పెళ్ళి వార్త కాదని ఎస్ ఎస్ రాజమౌళి చెప్పేసాడు. నిన్న బాహుబలి 2 లోగో ఆవిష్కరించిన సమయంలో రాజమౌళి ఈ సంచలన విషయాన్నీ ప్రకటించాడు దాంతో స్పెక్యులేశాన్స్ పెరిగాయి .

బాహుబలి ది కంక్లూజన్ షూటింగ్ దాదాపు పూర్తీ కావచ్చిందట. మరి అంత టెన్షన్ పెట్టే వార్త ఏమై ఉంటుందా అని అందరూ జుట్టు పీక్కుంటున్నారు. మరోవైపు  ఈ నెల 23 ప్రభాస్ పుట్టినరోజు  కావడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు . ఇక ప్రభాస్ చెప్పే సంచలన విషయం ఏంటి అన్నది తెలియాలంటే మరో నాలుగు రోజులు వెయిట్ చేయాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: