హీరో రామ్ నటించిన ‘హైపర్’ మూవీ తాజాగా థియోటర్స్ ని హిట్ చేసింది. అయితే ఈ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ వ్యవహారం చూస్తే..హీరో రామ్ కొంత షాకింగ్ అయ్యాడని అంటున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఈ వివరాలను చూస్తే...స్టార్ హీరో రామ్ ‘నేను శైలజా’ వంటి విజయం తరువాత చేసిన ‘హైపర్’ మూవీ.. రిలీజ్ కి ముందే భారీ బిజినెస్ ని చేసుకుంది.


గతంలో రామ్ నటించిన మూవీల కంటే ‘హైపర్’ మూవీకి ప్రీ బిజినెస్ ఎక్కువుగా జరిగింది. అంతే కాకుండా ‘హైపర్’ మూవీపై మార్కెట్ లో ఎక్కువుగా పాజిటివ్ టాక్స్ వినిపిస్తుంది. దీంతో ‘హైపర్’మూవీకి మొదటి రోజు కలెక్షన్స్ భారీగా వచ్చే ఛాన్స్ ఉందని అందరూ ఊహించారు. కానీ మొదటి రోజు కలెక్షన్స్ వివరాలు బయటకు రావటంతో దీనికి సంబంధించిన న్యూస్ రామ్ కి కొంత షాక్ ఇచ్చిందని తెలుస్తుంది. 


‘హైపర్’మూవీని కొంత అధిక రైట్స్ తోనే డిస్ట్రిబ్యూటర్స్ కొన్నారు. అయితే ఒక్క నైజాం ఏరియా మినహాయించి...మిగతా ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్స్ ఊహించినంతగా ‘హైపర్’ కి మొదటిరోజు కలెక్షన్స్ రాలేదు. దీంతో మొదటి కలెక్షన్స్ పై ఇతర ఏరియా డిస్ట్రిబ్యూటర్స్ కొంత నిరుత్సాహంలోనే ఉన్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం అటు నిర్మాతలకి, ఇటు హీరోకి సైతం అందింది.


దీంతో వీరు కొంత షాక్ అయ్యారని అంటున్నారు. అయితే మూవీకి సంబంధించిన రిపోర్ట్స్ పాజిటివ్ గా ఉండటంతో...వీకెండ్ లో ఈ మూవీ మంచి కలెక్షన్స్ ని సాధిస్తుందనే నమ్మకాన్ని కలిగిఉన్నారు. ఇక నైజాం ఏరియాలోనే ‘హైపర్’ మూవీ 1.51 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని సాధించింది. ‘హైపర్’సినిమాని దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించారు. ఈ చిత్రం ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: