గత సంవత్సరం తెలుగు ఇండస్ట్రీలో కనీ వినీ ఎరుగని చరిత్ర సృష్టించిన చిత్రం ‘బాహుబలి’. ఈ చిత్రంతో ఇప్పటి వరకు ఉన్న రికార్డు తుడిచిపెట్టుకు పోవడమే కాకుండా మళ్లీ ఆ రికార్డు సృష్టించాలంటే మరో బాహుబలి రావాల్సిందే అనడంతో అతిశయోక్తి లేదు. ఫ్యూజువల్ ఎఫెక్ట్ తో అద్భుతమైన వండర్ సృష్టించారు దర్శకధీరుడు రాజమౌళి.  దాదాపు రెండు సంవత్సరాలు సదీర్ఘంగా ఈ చిత్రాన్ని చిత్రీకరించిన జక్కన్న షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి ఎప్పుడూ సెన్సేషల్ న్యూస్ అవుతూ వచ్చాయి. బాహుబలి గత సంవత్సరం భారత దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తెలుగోడి సత్తా ఏంటో నిరూపించింది.
Image result for baahubali shooting
అంతే కాదు ఈ సంవత్సరం జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు కైవసం చేసుకుంది.  ప్రస్తుతం బాహుబలి 2 చిత్రం షూటింగ్ అవుతుంది.. డిసెంబర్ లో పూర్తి చేసుకొబోతుందని నిన్న లోగో ఆవిష్కరణ సందర్భంగా దర్శకులు రాజమౌలి అన్నారు.  సాధారణంగా రాజమౌళి షూటింగ్  చాలా పకడ్భందీగా చేస్తుంటారు..చిత్రంలో నటీనటులు ఎవరైనా ఎంతటి వారైన తన మాట వినాల్సిందే..అలాంటి కండీషన్స్ పెడుతుంటాడట.
Image result
ఈ సమయంలో సెల్ ఫోన్స్ కూడా ఎవ్వరు వినియోగించరని వార్తలు కూడా వచ్చాయి. అందుకే ఈ చిత్రానికి సంబంధించి ఎలా ఫోటోస్ బయటకు రావు. గతంలో ఈ చిత్రానికి సంబంధించి పోరాట సన్నివేశాలు బయటకు రావడంతో అప్పటి నుంచి చాలా పకడ్భందీగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ విలేఖరి మరి బాహబలి టీమ్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారన్న ప్రశ్నకు నవ్వుతే డిసెంబర్ లో అందరూ రిలీజ్ అయిపోతారు అన్నారు. అంటే బాహుబలి టీమ్ ని ఇప్పటి వరకు దర్శకధీరుడు రాజమౌళి అరెస్టు చేశాడా..? అని ప్రెస్ మీట్ కి వచ్చిన అందరూ నవ్వుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: