అక్కినేని ఇంట పెళ్లి బాజాలు మోగడానికి ఇంకా ఎన్నోరోజులు టైం లేదు అన్నది తెలిసిన వార్తే.. నాగ చైతన్య సమంతల లవ్ కు ఇరు వర్గాల తల్లి తండ్రులు సపోర్ట్ ఇవ్వడంతో ఈ ప్రేమ జంట పెళ్లితో ఒక్కటి కాబోతుంది. అయితే అసలు నాగ చైతన్య, సమంతల లవ్ లో ముందు ఎవరు ఎవరిని ప్రపోజ్ చేశారు అన్నది తెలుసుకోవాలని ఆడియెన్స్ లో చిన్న ఎగ్సైట్మెంట్ ఉంటుంది. 


ఇన్నాళ్లు ఈ విషయం మీద నోరు మెదపని నాగ చైతన్య ఫైనల్ గా ఓపెన్ అయిపోయాడు. కింగ్ నాగార్జున ఏమో నిశ్చితార్ధం పెళ్లి అంటూ స్పీడ్ మీదుంటే చైతు, సమంతలు తమ ప్రేమను బయట పెట్టడానికి ఇంకా వెనుకడుగేస్తున్నారు. అందుకే చైతు కాస్త ముందడుగేసి సమంతతో ప్రేమ విషయాన్ని చెప్పేశాడు. ఏమాయ చేసావే సినిమాతో పరిచయం ఏర్పడ్డ ఇద్దరు మంచి స్నేహితులయ్యారట.


ఇక ఆ చనువుతోనే మళ్లీ మళ్లీ కలిసి నటించడం నటించిన సినిమాల హిట్లు ఫ్లాపుల గురించి మాట్లాడటంతో ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చాయట. ఇక ఎన్నాళ్లు ఇలా బోయ్, గాళ్ ఫ్రెండ్ రిలేషన్ లో ఉందామని ముందు నాగ చైతన్యనే సమంతకు ఇష్టముంటే పెళ్లి చేసుకుందాం లేదంటే ఈ రిలేషన్ ఇప్పటితో ఆపేద్దాం అన్నాడట. సమంత కూడా చైతు ప్రపోజల్స్ నచ్చడంతో ఓకే అనిసిందట.


నవతరం సిని ప్రేమ జంటగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న చైతు, సమంతల క్రేజీ జంట ఎంతోమందికి ఆదర్శం.. అంతేకాదు తనలోని ప్రేమను వ్యక్త పరచి ఆ విషయాన్ని నిక్కచ్చిగా చెప్పేస్తున్న చైతు మంచితనం నచ్చబట్టే సమంత కూడా ఓకే అనేసి ఉంటుంది. ఇక పెళ్లి మాత్రం వచ్చే ఏడాది ఉంటుందని చెప్పిన చైతు.. తన లవ్ పెళ్లి మ్యాటర్ ఇదంతా ఈ సంవత్సరంలోనే జరిగిపోయాయని అంటున్నాడు.   



మరింత సమాచారం తెలుసుకోండి: