ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన ఢిల్లీ భామ తాప్సి సౌత్ లో సెక్స్ అప్పీల్ తో బాగా ప్రయత్నించింది కాని అమ్మడు స్టార్ ఇమేజ్ సంపాదించడంలో మాత్రం వెనుకపడ్డది. ఇక్కడ సినిమాలు చేస్తూనే బాలీవుడ్లో అడపాదడపా ప్రయత్నాలు చేసిన తాప్సి అక్కడ బాగానే క్రేజ్ తెచ్చుకుంది. అయితే రీసెంట్ గా వచ్చిన పింక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తాప్సి ఇక సౌత్ సినిమాపై తన కొరడా ఝుళిపించింది.  


ముఖ్యంగా టాలీవుడ్ మీద తాప్సి తన మనసులోని మాటని బయటపెట్టింది. తెలుగు నిర్మాత తనని డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టాడని.. రెమ్యునరేషన్ కోసం డిమాండ్ చేస్తే ఫేక్ చెక్కులు ఇచ్చారని తెలుగులో కేవలం హీరోలకు మాత్రమే పారితోషికం సరిగా ఇస్తారని హీరోయిన్స్ అంతటికి ఇలాగే అన్యాయం జరుగుతుంది అన్నది తాప్సి. అయితే తాప్సి బయట పెట్టిన నిర్మాత బాగోతం ఎవరిని ఉద్దేశించా అన్నది ఇప్పుడు హాట్ న్యూస్ అయ్యింది.


తనతో సినిమాలు తీసిన నిర్మాత లిస్ట్ లో ఆ ఎగ్గొట్టిన నిర్మాత ఎవరా అని ఆరా తీస్తారని నిర్మాత గుండెల్లో భయం మొదలైంది. అయితే దాదాపు ఈ మధ్య కాలంలో సౌత్ సిని పరిశ్రమపై ముఖ్యంగా తెలుగు సినిమాపై హీరోయిన్స్ ఇలా హాట్ కామెంట్స్ చేయడం అందరిని ఆశ్చర్యంలో పడేస్తుంది. మరి ఇక్కడ స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న భామలకు రాని లోటు కేవలం ఇక్కడ ఫేడవుట్ అయిన భామలకే ఎందుకు వస్తుందో అర్ధం కాని విషయం.


తాప్సి చేసిన కామెంట్స్ తో ఇక దాదాపు తన తెలుగు పరిశ్రమకు గుడ్ బై చెప్పినట్టుగానే అనిపిస్తుంది. పింక్ సినిమా హిట్ అవడంతో ఇన్నాళ్లు తనని సౌత్ సినిమాలు కేవలం అందానికే వాడుకున్నారని తనలోని నటిని బయట పెట్టి సత్త చాటానని చెప్పిన తాప్సి మరి ఫ్యూచర్ లో అసలు ఇటు వైపు చూసే ఉద్దేశం లేదు కాబోలు. 



మరింత సమాచారం తెలుసుకోండి: