దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేది పెద్దలు మనకు చెప్పిన మాట.. అయితే గ్లామర్ ఉండగానే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనేది హీరోయిన్ల బాట. అవును నయనతార ఇప్పుడు ఈ మంత్రాన్నే పఠిస్తోంది. పాటిస్తోంది. సాధారణంగా మూడు పదుల వయస్సుకొచ్చే సరికి హీరోయిన్ల మార్కెట్ డౌన్ అయిపోతూ ఉంటుంది. నయనతార ఇక్కడే జాగ్రత్తపడింది. 30ఏళ్లు దాటినా.. తనలో గ్లామర్ తగ్గకుండా ఉండేందుకు భారీ వర్కౌట్సే చేసింది. ఇందుకు ఆమె ప్రస్తుత ఫిజికే నిదర్శనం.