నిఖిత గుర్తుందా..? అదేనండీ డాన్ మూవీలో లారెన్స్ లవర్ గా చేసిన హీరోయిన్. హాయ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. కల్యాణరాముడు, ఖుషీఖుషీగా, సంబరం వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. అనసూయ తర్వాత తెలుగు తెరపై ఎక్కడా కనిపించలేదు. కానీ తమిళ్, మలయాళంలో కనిపిస్తున్న ఈ బ్యూటీ.. త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది.