తెలుగు .. తమిళ ..హిందీ భాషల్లో ప్రభుదేవాకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. కొరియోగ్రాఫర్ గా .. నటుడిగా .. దర్శకుడిగా రాణించడం ఆయన ప్రత్యేకత. కొంతకాలంగా బాలీవుడ్ సినిమాలపైనే ఆయన తన ఫోకస్ పెట్టాడు. ఇక ఇటీవలే నటుడిగా తమిళంలో దేవి (అభినేత్రి) సినిమా చేశాడు. తెలుగులో దర్శకుడిగా మళ్లీ ఒక సినిమా చేయాలని ఉందని ఈ సమయంలోనే చెప్పిన ప్రభుదేవా, అందుకు సంబంధించిన ప్రయత్నాల్లో బిజీగా వున్నాడని చెప్పుకుంటున్నారు.