ఈ మధ్య కాలంలో దిల్ రాజు మూవీలకి సంబంధించిన వేగాన్ని తగ్గించాడనే టాక్స్ ఇండస్ట్రీలో బాగానే వినిపిస్తున్నాయి. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. గతంలో దిల్ రాజు తెరకెక్కించిన వరుస చిత్రాలు అనుకున్నంత విజయాన్ని చేజిక్కించుకోకపోవటంతో కొంత మేర నష్టాలను చూడాల్సి వచ్చిందని అంటున్నారు. అందుకే మూవీల నిర్మాణం విషయంలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటున్నారు.