"సినిమాలు చూడాలంటేనే భయమేస్తోంది. మానవత్వం, సున్నితత్వం మచ్చుకైనా కనపడవు. తెరనిండా పాశ్చాత్య పోకడలు. చిట్టి పొట్టి దుస్తులు! పాత్రల్లో భారతీయత మచ్చుకైనా ఉందా పోనీ ఎక్కడైనా ఉందా? సినిమాల వల్ల జనం, వారి మనసులు కూడా కఠినంగా మారిపోతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమావాళ్లు దారుణంగా, సిగ్గు, నియమం, మానం వదిలేసి బరితెగించారు. ఫిలింమేకింగ్ పచ్చి వ్యాపారం అయిందిప్పుడు. మాట్లాడితే 100 కోట్ల కలెక్షన్లు, లేదంటే తొలివారం రికార్డులు. బాబోయ్.. ఇవన్నీ నాకు ఎప్పటికీ అర్థంకాని విషయాలు. అందుకే అలాంటి చోట నేను ఉం