ఇప్పటి వరకూ టాలీవుడ్ పిల్మ్ ఇండస్ట్రీలో ఏ హీరో చేయని సాహసం... పవన్ కళ్యాణ్ చేస్తున్నారని అంటున్నారు. ఎందుకంటే ఎవరైనా ఏదైనా రంగంలో సాధించాలంటే పూర్తి సమయాన్ని దాని కోసమే కేటాయిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇందుకు మినహాయింపు అన్నట్టుగా తన తీరుని చూస్తుంటే కనిపిస్తుంది. ఒక వైపు ఫిల్మ్ ఇండస్ట్రీలో కెరీర్ ని కొనసాగిస్తూనే..మరోవైపు రాజకీయంగా అడుగులు వేస్తున్నారు.