తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు మెగా ఫ్యామిలీకి మూవీస్ రిలీజ్కు సంబంధించిన టాక్ నడుస్తోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నటిస్తున్న ధృవ సినిమా మీద మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అటు చాలా కాలం తర్వాత మెగాస్టార్ హీరోగా నటిస్తున్న ఖైదీ నెంబర్ 150 నిర్మాణంలో ఉండడం, అదీగాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు మూవీ పట్టాలెక్కడంతో టాలీవుడ్ లో ఇప్పుడు మెగా ఫ్యామిలీ సినిమాలు హాట్ టాపిక్ మారాయి.