"బాహుబలి" సినిమాను హిందీలో రిలీజ్ చేయడం ద్వారా ధనలక్ష్మిని మూటగట్టుకొని లక్కీహ్యాండ్ అనిపించుకున్నాడు కరణ్ జోహార్. ఈ సినిమాను హిందీలో కరణ్ రిలీజ్ చేయడం పరస్పర ప్రయోజనాలు పొందింది. అంటే ఉభయతారకంగా పని చేసింది. దాని వల్ల సినిమాకు మేలు జరిగింది. అలాగే కరణ్ జోహార్ కూడా బాగా లాభపడ్డాడు. ఇప్పుడు కరణ్ జొహార్ దృష్టి మరోసారి దక్షిణ భారత సినిమాల మీద పడింది.