కొందరు బతికి ఉన్నప్పుడు ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారో.. చనిపోయాక కూడా అంతే పేరు ప్రఖ్యాతులు పొందుతారు. అలాంటి వారిలో జయలలిత ఒకరు. ఆమె బతికినన్ని రోజులు పురుచ్చితళైవిగానే బతికారు. చనిపోయాక కూడా తమిళ ప్రజల్లో విప్లవ నాయకిగానే చిరస్థాయిగా గుర్తుడిండి పోతారు. అంతటి పేరు సంపాదించుకుంది జయలలిత. ఆమె బతికి ఉన్నప్పుడు ఆమెపట్ల వ్యతిరేకత కలిగిన వారు, ఆమెను ఎదురించిన వారు. ఆమెంటే ఇష్టం లేని వారు ఇలా ఎవరైనా కావచ్చు. ఇప్పుడు మాత్రం అయ్యో అంటూ భోరున విలపిస్తున్నారు.