ప్రస్తుతం శ్రియ తెలుగులో ‘పవిత్ర’లో నటిస్తోంది. కథానాయిక ప్రధాన పాత్రగా సాగే కథ ఈ చిత్రం. మరోపక్క కన్నడలో ఇదే తరహా చిత్రంలో నటిస్తోంది. రూపా అయ్యర్ దర్శకత్వంలో ‘చంద్ర’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇదీ హీరోయిన్ ఓరియెంటెడ్ కథాంశమే. నిజానికి చంద్ర పాత్రలో ఎంతోమంది హీరోయిన్లను అనుకున్నారట. కానీ, రాజకుమారి పాత్రకు శ్రియ అయితేనే న్యాయం చేయగలదని ఏరికోరి మరీ ఆమెను హీరోయిన్ గా ఎంచుకుంది దర్శకురాలు. ఇలాంటిదే స్త్రీ పాత్ర ప్రాధాన్యమున్న మరో కథను ఇటీవలే ఓ తమిళ నిర్మాత శ్రియకి వినిపించాడని సమాచారం. వరస చూస్తుంటే ఇకపై శ్రియ హీరోల సరసన గ్లామర్ డాల్ గా కనిపించే అవకాశాలు తగ్తుతున్నాయనే చెప్పొచ్చు అంటున్నారు విశ్లేషకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: