కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదడం అంటే ఇదే. చేతులు కాలాక పట్టుకోవడానికి ఆకులు దొరుకుతాయేమోగానీ... సినిమా ఫ్లాపయ్యాక పెట్టిన డబ్బులు తిరిగి రావు కదా. ప్రస్తుతం తాప్సీ విషయంలోనూ ఇదే జరిగింది. తాప్సీకీ, మంచు కుటుంబానికీ ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మంచు లక్ష్మిమీద ఉన్న నమ్మకంతో గుండెల్లో గోదారి సినిమాలో నటించడానికి ఒప్పుకుంది తాప్సీ. అంతేకాదు, మరో సాహసం కూడా చేసింది. అదేంటంటే... చిత్ర నిర్మాణానికి లక్ష్మీ ఇబ్బందులు పడుతుంటే ఆర్థిక సాయం కూడా చేసింది. పోనీ అంతటితో ఆగిందా... మామూలు సినిమాలకు తాను తీసుకునే రెమ్యునరేషన్ కూడా తగ్గించింది. ఎందుకూ అంటే... సినిమా హిట్టయితే డబ్బులొస్తాయి కదా అని. కానీ, తాప్సీ ఊహించినట్టు జరగలేదు. సినిమా ఫ్లాపయింది. దాంతో తాప్సీ చేతులు కాలాయి. పాపం, అనవసరంగా డబ్బులు పెట్టానని తెగ బాధపడుతోందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: