ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ భోజనంలాంటి సినిమా చూపించడంలో పూరి జగన్ సిద్ధహస్తుడు. ముఖ్యంగా స్పైసీగా సినిమాలు తీయడం జగన్ కి కరతలామలకం. అందుకోసం ఐటెమ్ సాంగ్స్ పెట్టడం పూరి నుంచే ఇటీవలికాలంలో ప్రారంభమైందని చెప్పాలి. పోకిరిలో ముమైత్ ఖాన్ తో ఇప్పటికింకా నావయసు అనిపించాడు పూరి. దాన్ని ఎవరు మరిచిపోగలరు? ఆ ట్రెండ్ ని తరవాత చాలామంది దర్శకులు ఫాలో అయ్యారు. అయితే, ఐటెమ్ గాళ్స్ ని మార్చడంలోనూ పూరిది అందెవేసిన చేయి. ఇప్పుడు పూరి ఇద్దరమ్మాయిలతో చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో కొత్తగా ఓ స్పైసీ సాంగ్ పెట్టాడు. మరి, స్పైసీ సాంగ్ అంటే ఐటెమ్ గాళ్ ఉండొద్దూ. అందుకే, దేవ్షీ ఖండూరీ అనే భామను తీసుకొచ్చాడు. స్పెయిన్ లో ఈ పాట షూటింగ్ జరిగింది. దీనికి స్టెప్పులు గణేష్ మాస్టర్ కంపోజ్ చేశాడు. ‘పూరి జగన్ గారితో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. పాటను చాలా విభిన్నంగా కంపోజ్ చేశారు’ అని చెబుతోంది దేవ్షి. దేవ్షి... ప్రస్తుతం ‘ద సిటీ దట్ నెవ్వర్ స్లీప్స్’ అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. త్వరలోనే ఈ చిత్రం విడుదలవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: