దేవిశ్రీ ప్ర‌సాద్- అల్లు అర్జున్ క‌ల‌యిక అంటే కావ‌ల్సినంత హంగామా ఉంటుంది. ఆడియోలో ఐటెమ్స్ అద‌ర‌గొట్టేస్తాయి. ఆ అంటే అమ‌లాపురం నుంచీ... రింగ రింగ వ‌ర‌కూ అన్నీ కేక పెట్టించే పాట‌లే. ఇప్పుడు వీళ్లిద్ద‌రి క‌ల‌యిక‌లో మ‌రో అల్బ‌మ్ రూపుదిద్దుకొంటోంది. అదే.. ఇద్ద‌ర‌మ్మాయిల‌తో. ఇందులోనూ మెగాఫ్యాన్స్ అదిరిపోయే ఐటెమ్ పాటేదో ఊహిస్తారు. అయితే వాళ్లందిరికీ ఈసారి సారీ. ఎందుకంటే... ఇద్ద‌ర‌మ్మాయిల‌తో సినిమాలో ఐటెమ్ పాట‌కు ఛాన్సే లేదు. అయితే బ‌న్నీ డాన్స్ చేయ‌డానికి మాంఛి బీటున్న పాట‌లు ఇచ్చాడంట‌. మెలోడీకీ ఈ సినిమాలో స్కోప్ ఉంది. మ‌రి ఆ బీటు.. ఏ రేంజులో ఉంటుందో తెలియాంటే ఇంకొద్ది రోజులు ఆగాలి 

మరింత సమాచారం తెలుసుకోండి: