తెలుగులో ఇప్పుడు అనేక హస్యకథా చిత్రాలు వస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలు ఇప్పుడు హస్యభరితంగా రూపొందుతున్నాయి. మరి తెలుగులో వచ్చిన తొలి హస్యకథా చిత్రం గురించి తెలుసా... 1940 లో విడుదలయ్యిన ‘బారిస్టర్ పార్వతీశం’ సినిమా మొట్టమొదటి హస్యకథా చిత్రంగా పేరు తెచ్చుకుంది. మొక్కపాటి నరిశింహ శాస్త్రి రచించిన ప్రసిద్ధి పొందిన ‘బారిస్టర్ పార్వతీశం’ ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. ‘బారిస్టర్ పార్వతీశం’ సినిమాకు ఎచ్.ఎమ్.రెడ్డి దర్శకత్వం వహించారు. లంక సత్యం ప్రధాన పాత్రలో నటించగా జి.వరలక్ష్మి పార్వతీశం భార్యగా నటించింది. ఈ సినిమా అనుకున్నంత అర్థిక విజయం సాధించలేకపోయినా మొదటి తెలుగు హస్యకథ సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: