అల్లు అర్జున్ న‌ట‌న‌, స్టైల్‌, డాన్స్ చూసి ఓ క‌థానాయిక ఫిదా అయిపోయింది. క‌థానాయ‌కుడు అంటే అలా ఉండాలి... అంటూ కితాబు ఇచ్చేస్తోంది. ఆ అమ్మాయి ఎవ‌రో కాదు... కేథ‌రిన్‌. ఇద్ద‌ర‌మ్మాయిల‌తో సినిమాలో బ‌న్నీ స‌ర‌స‌న న‌టించింది. ఈ సినిమాలో బ‌న్నీ పెర్‌ఫార్మెన్స్ చూసి.. తెగ లైకింగు చేసేసింద‌ట‌. అంత ఈజ్‌, అంత జోష్‌... నేను ఎవ‌రిలోనూ చూళ్లేదు. బ‌న్నీ డాన్స్ గురించి ఇక ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన అవ‌సరం లేదు. అత‌ని ద‌గ్గ‌ర నుంచి చాలా విష‌యాలు నేర్చుకొన్నా. క‌చ్చితంగా ఇద్ద‌ర‌మ్మాయిల‌తో సినిమా నాకు తెలుగులో మంచి బ్రేక్ ఇస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది... అని తెగ సంబ‌ర ప‌డిపోతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: