రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమా అటు సినిమా పరిశ్రమలోనూ, ఇటు ప్రేక్షకులలోనూ సంచలనం సృష్టించింది. రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు తోడు, ఈ సినిమాలోని గ్రాఫిక్స్ అందర్నీ అకట్టుకున్నాయి. అందుకు తగ్గట్టు గానే ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అలాగే మొదటి, రెండవ వారంలో ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధించింది. అయితే మూడవ వారం నుంచి ఈగ సినిమాకు కలెక్షన్లు గణనీయంగా తగ్గినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మొదట్లో ‘ఈగ’ జోరు చూసి ఈ సినిమా తెలుగు సినిమా చరిత్ర టాప్-3లో నిలుస్తుందని చాలామంది అంచానా వేశారు. అయితే తాజా కలెక్షన్లు చూసిన వారు ఈ ఈగ సినిమా దూకుడు రికార్డు ను కూడా దాటలేదని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: