తెలుగు సినిమాల్లో హస్యాన్ని కొత్త పుంతలు తొక్కించిన నటుడు అల్లు రామలింగయ్య. అల్లు పశ్చిమ గోదావరి పాలకొల్లులో 1922 అక్టోబర్ 1 జన్మించారు. నటనతో మక్కువతో మొదట నాటకాల్లో నటించి తరువాత సినిమా రంగ ప్రవేశించారు. 1952లో పుట్టిల్లు సినిమాతో చిత్ర రంగ ప్రవేశించారు. ఇక అప్పట్నించి ఎన్నో పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేశారు. కామెడీ, కామెడీ విలనిజం, క్యారెక్టర్ పాత్రలు చేశారు. మనషులంతా ఒక్కటే అనే సినిమాలో అల్లు నటించిన ముత్యాలు వస్తావా అనే పాట అప్పట్లో సూపర్ హిట్. అలాగే ఆయన అమ్యాయ్య, అప్పుం అప్నుం వంటి కొత్త తెలుగు పదాలను సృష్టించారు. 2004 జులై 31న మరణించే నాటికి అల్లు 1030 సినిమాల్లో నటించారు. 1116 సినిమాల్లో నటించాలనే కోరికను అల్లు రామలింగయ్య తీర్చుకోలేక పోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: