తాను నటించిన తొలిచిత్రంతోనే ఆంధ్ర రాష్ట్రాన్నిఒక ఊపు ఊపేసిన భామ సదా. జయం సినిమాలో సదా పలికిన ‘వెళ్ళవయ్యా.. వెళ్లు’ డైలాగ్ ఎంతో ప్రాచుర్యం పొందింది. తరువాత చాలా సినిమాల్లో సదా నటించింది. అటు తమిళం, ఇటు తెలుగు సినిమాల్లో కూడా సదా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే చేసిన సినిమాలు పరాజయం కావడం, స్వయంగా చేసిన తప్పులతో సదా కెరీర్ ఒక్కసారిగా పడిపోయింది. సదాకు అవకాశాలు తగ్గిపోయాయి. పెద్ద హీరోలు సదా పట్టించుకోవడం మానేశారు. దీంతో చిన్న సినిమాలు, చిన్న పాత్రలతో సదా కెరీర్ ను నెట్టుకోస్తుంది. కాగా, సదా కన్నడంలో నటించిన సినిమాను తెలుగులో ‘ఆ రోజుల్లో’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో పెద్దగా గుర్తింపులేని వారితో సదా నటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: