వైవిద్యమైన చిత్రాలు చేయడం నాగార్జునకు ఇష్టం. అందుకే ఎప్పటికప్పుడు విభిన్నమైన కథనాలను ఎన్నుకొని ఆయన సినిమాలు చేస్తుంటారు. ప్రస్తుతం ‘ఢమరుకం’ లాంటి ఫ్యాంటసీ మూవీలోనూ ఆధ్యాత్మిక భక్తి చిత్రం ‘షిరిడీ సాయి’లో సాయిబాబగానూ, ఫార్టీ ప్లస్ లో ప్రేమికుడిగా, భాయ్ చిత్రంలో మాస్ పాత్రలోనూ చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు చిత్రాలు ‘నాగ్’ చేతిలో ఉన్నా నాగార్జున ఊ అంటే మరి కొందరు నిర్మాతలు రెడీగా ఉన్నారు ఆయన కాల్షీట్ల కోసం. అయినా క్వాలిటీ పరంగా ఎక్కడా దెబ్బ తినకూడదని తన ప్రతి చిత్రాన్ని ఛాలెంజ్ గా చేస్తున్నారు నాగార్జున. ఇక మరో నెల రోజుల్లో నాగ్ నటించిన పూర్తి ఆధ్యాత్మిక చిత్రం ‘షిరిడి సాయి’. విడుదలకు ముందే ఎంతో ప్రచారం చూరగొంటోంది. ముఖ్యంగా సాయి భక్తులు ‘షిరిడి సాయి’ ఎప్పుడు దర్శనమిస్తాడా? అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక ‘నాగ్’ అభిమానుల గురించి చెప్పనక్కరలేదు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో...ఏదో అక్కినేని నాగార్జునకు మాత్రమే మహనీయుల పాత్రలు చేసే అదృష్టం దక్కుతోంది. మొన్న ‘అన్నమయ్య’గా.. నిన్న ‘శ్రీ రామదాసు’గా నేడు అవతార పురుషుడిగా భావించే ‘శిరిడి సాయి’గా ఒదిగిపోయే ఏకైక నటుడు నాగార్జున అని చెప్పవచ్చు. మరో విషయం ఏమిటంటే ఈ మూడు చిత్రాలకు సూపర్ త్రయం ఎం.ఎం.కీరవాణి, కె. రాఘవేంద్రరావు, నాగార్జునలే కావడం విశేషం. నాగార్జున ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ చిత్రాల్లో నాగార్జున భక్తుని పాత్రలో నటించగా, ‘షిరిడి సాయి’లో ఏకంగా బాబాగా దర్శనం ఇవ్వనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: