బంతిలా ఉండే సునీల్ సిక్స్ ప్యాక్‌లో క‌నిపించి అంద‌రికీ షాక్ ఇచ్చాడు. సునీల్ ఇలా అయిపోయాడేంటి? అని ముక్కున వేలేసుకొన్నారు. సునీల్ బాడీ చూసి క‌ళ్లు బైర్లు క‌మ్మాయి కూడా! ఆ జాబితాలో త‌మ‌న్నా కూడా చేరింది. త‌డాఖా ఆడియో వేడుక‌లో సునీల్‌ని తెగ పొగిడేసింది. సునీల్ బాడీ పెంచిన తీరుకి హ్యాట్సాఫ్ చెప్పింది. ఆయ‌న త‌న శ‌రీరాన్ని మ‌ల‌చుకొన్న విధానం చూసి ఎవ‌రైనా స్ఫూర్తి పొందొచ్చ‌ట‌. సునీల్ ని పొగిడి చైతూని పొగ‌డ‌క‌పోతే బాగోద‌ని... త‌న‌కీ ఓ కాంప్లిమెంట్ ప‌డేసేంది. చైతూని చూస్తుంటే స్కూల్లో, కాలేజీలో క‌ల‌సిచ‌దువుకొన్న స్నేహితుడిలా క‌నిపించాడ‌ట‌. అంటే... హీరోలా అస్స‌లు క‌నిపించ‌డం లేదా? ఏమో మ‌రి. త‌డాఖా పాట‌లు బుధ‌వారం హైద‌రాబాద్‌లో విడుద‌ల‌య్యాయి. త‌మ‌న్ సంగీతం అందించారు. డాలీ ద‌ర్శ‌కుడు. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన వెట్టై చిత్రానికి ఇది రీమేక్‌. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తాడు. ఈ సినిమాలో నాగ‌చైత‌న్య‌తో జ‌త క‌ట్టింది త‌మన్నా. మ‌రి సునీల్‌కి ఎందుకు పొగిడింది చెప్మా??  

మరింత సమాచారం తెలుసుకోండి: