ఒకనాటి అందాల తార రాధ కుమార్తె కార్తీక జోష్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా పరాజయం చెందడంతో పాటు తల్లి అందాలు ఈ కూతురు దగ్గర లేక పోవడంతో కార్తీకకు మళ్లీ ఛాన్సులు రాలేదు. జీవాతో నటించిన ‘రంగం’ డబ్బింగ్ సినిమాతో కార్తీక మళ్ళా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా హిట్ అయినా కార్తీక కెరీర్ కు ఉపయోగ పడలేక పోయింది. ఇలాంటి దశలో జూనియర్ ఎన్టీఆర్ తో దమ్ము లో నటించింది. దమ్ము బాక్సాఫీసు వద్ద చతికల పడటంతో కార్తీక కెరీర్ డైలామాలో పడింది. కాగా, కార్తీక నటించిన రవివర్మ సినిమా త్వరలో విడుదల కానుంది. ప్రసిద్ధ భారతీయ చిత్రకారుడు రవివర్మ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. రవివర్మగా ప్రముఖ ఫోటోగ్రాఫర్ సంతోష్ శివన్ నటిస్తున్నారు. కార్తీక, నిత్యామీనన్ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. నిత్యామీనన్ కు ఎలా ఉన్నా కార్తీకకు ఈ సినిమా విజయం చాలా ముఖ్యం. 

మరింత సమాచారం తెలుసుకోండి: