‘దేశముదురు’ తరువాత పూరీ జగన్నాథ్-అల్లు అర్జున్ కలయికలో వస్తున్న సినిమా ‘ఇద్దరమ్మాయిలతో..’. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమాలోని పాటలు ఎలా ఉన్నాయో చూద్దాం.. !

‘ఇద్దరమ్మాయిలతో..’ అల్బమ్ మొత్తం 5 పాటలు ఉన్నాయి. వీటికి దేవి శ్రీ ప్రసాద్ , విశ్వ, భాస్కరభట్ల, రామజోగయ్య శాస్ర్తి సాహిత్యం అందించగా, మనో, సుచిత్ర, రెనినా, దేవి శ్రీ ప్రసాద్, డేవిడ్, అనిత, సాగర్ అలపించారు.

మెదటి పాట : సీతా గీతా రన్ రన్...

‘సీతా గీతా రన్ రన్..’ అనే ఉషారైన గీతంతో ఈ అల్బమ్ ప్రారంభ అయ్యింది. రామజోగయ్య శాస్ర్తి రచించిన ఈ పాటను దేవిశ్రీ ఆలపించాడు. అపాచె ఇండియన్ గొంతు ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ తెచ్చింది. దేవి-అల్లు అర్జున్ కలయికలో వచ్చే పాటలు ఎలా ఉంటాయని అశిస్తారో ఈ పాట అదే విధంగా ఉంది.

రెండవ పాట : శంకరాభరణంతో ..

ఈ అల్బమ్ మొదటి పాట ఎంత ఉషారుగా సాగిందో ఉందో.. రెండవ పాట అంత హస్యంగా సాగింది. దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం అందించిన ఈ పాటను మనో అలపించారు. సరదా పదాలను వినసొంపుగా అలపించారు. ఈ సినిమాకు అందం తీసుకొచ్చే పాట ఇది.

మూడవ పాట : వయోలిన్ పాట

ఇటీవల వచ్చిన తెలుగు పాటల్లో ఈ కొత్తగా నిలిచిపోతుంది. దేవిశ్రీ ప్రసాద్ టాలెంట్ కు ఈ పాట అర్థం పడుతుంది. విశ్వ సాహిత్యం అందించగా ఈ పాటను డేవిడ్, అనిత అలపించారు. వింటుంటే కొత్త అనుభూతిని కలిగించే ఈ పాటను తప్పకుండా వినితీరాల్సిందే..!

నాలుగవ పాట : గణపతి బప్పా ..

భాస్కరభట్ల సాహిత్యం సమకూర్చిన ఈ పాట గణపతిని స్తుతిస్తూ సాగుతూ మరో వైపు మనిషిలో నిరాశను ప్రారలద్రోలే విధంగా ఉంటుంది. ఇది పూరీ జగన్నాథ్ స్టైల్ పాటని చెప్పుకోవాలి. ఎక్కువ కాలం గుర్తుండే లక్షణాలు ఈ పాటకు ఉన్నాయి.

ఐదవ పాట : టాప్ లేసి పొద్ది..

ఈ అల్బమ్ లో  అతి  ఉషారైన పాట ఇది. దేవిశ్రీ- అల్లు అర్జున్ లో జోష్ ఈ పాటలోనూ కనిపిస్తుంది. భాస్కర భట్ల సాహిత్యం సాగర్, రెనినా ల గానం ఈ పాటకు మరింత ఉషారు తెచ్చింది. థీయేటర్లలో అభిమానుల చేత గోల పెట్టించే పాట ఇది. అల్బమ్ లో టాప్ లేచిపోయే పాట ఇది.

మరింత సమాచారం తెలుసుకోండి: