త‌మిళ తంబీల‌కు ఓ పిచ్చి వుందండి. హీరోయిన్ న‌చ్చిందంటే ఆరాదిస్తారు. గుడులు క‌ట్టేస్తారు. అంతటితో ఆగ‌రు..తాము తినే ఇడ్లీల‌కు కూడా ఆ హీరోయిన్ పేరు త‌గిలించేస్తారు. ఆ మద్య  హీరోయిన్ ఖుష్బూకు  ఇడ్లీ ఖుష్బూ అని పేరు పెట్టేశారు. ఆ త‌రువాత లావు ఇడ్లీల‌ను  న‌మిత ఇడ్లీ అని పిలుచుకున్నారు.
ఇపుడు  ఆ వ‌రుస‌లో హ‌న్సిక వంతు వ‌చ్చేసింది.  తెలుగులో ఆఫ‌ర్లు త‌గ్గిన వేళ కోలీవుడ్ లో అడుగు పెట్టిన ఈ సుంద‌రిని గ‌త రెండేళ్లుగా త‌మిళ తంబీలు ఓ రేంజ్ లో ఆరాదిస్తున్నారు. అందుకే నాజూకుగా ....సన్నని, గుండ్రని ఇడ్లీల‌ను హ‌న్సిక ఇడ్లీగా పిలుచుకుంటున్నారట‌. ఇలా త‌మిళ‌తంబీల త‌న‌పై కురిపిస్తున్న ప్రేమ‌కు హ‌న్సిక కూడా క‌రిగిపోయింద‌ట‌. అందుకే ప్రస్తుతం స‌మ్ ధింగ్ స‌మ్ ధింగ్ సినిమా కోసం సన్నబ‌డిన ఈ సొగ‌స‌రి మ‌ళ్లీ కాస్త బొద్దు అవ్వాల‌నుకుంటుంద‌ట‌.
అభిమానంతో ఇడ్లీల‌కు తంబీలు హ‌న్సిక పేరు పెట్టడం బాగానే వుందిగానీ ...వారి కోసం బొద్దు అవ్వాల‌నుకోవ‌డ‌మే కాస్త సిల్లీగా వుంద‌ని కొంద‌రు అంటున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: