ఇటీవల కాలంలో తక్కువ టైమ్ లో ఎక్కువ పేరు తెచ్చుకున్న నిర్మాతగా బండ్ల గణేష్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే ‘బాద్ షా’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భారీ చిత్రాల నిర్మాత త్వరలోనే ‘ఇద్దరమ్మాయిలతో..’ ధియేటర్లలో సందడి చేయనున్నాడు. కాగా, ఫిల్మ్ చాంబర్ లో బండ్ల గణేష్ రిజిస్టర్ చేయించిన కొత్త టైటిల్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ‘టాప్ లేచిపోద్ది’ అనే టైటిల్ ను బండ్ల గణేష్ తాజాగా రిజస్టర్ చేయించాడు. ఈ ‘టాప్ లేచిపోద్ది’ అనేది త్వరలో రానున్న ‘ఇద్దరమ్మాయిలతో..’ సినిమాలో ఒక గీతం. ఈ ‘టాప్ లేచిపోద్ది’ అనే పాట అత్యంత ప్రజాదరణ పొందుతుంది. ఇప్పుడు దాన్నే కొత్త సినిమాకు టైటిల్ గా ఎంచుకున్నాడు బండ్ల గణేష్.

బండ్ల గణేష్ త్వరలో రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో సినిమాలు చేయనున్నాడు. వీటిలో ఒక సినిమాకు ‘టాప్ లేచిపోద్ది’ అనే టైటిల్ పెట్టే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: