అనుమానాలు ప‌టాపంచ‌లైపోయాయి. ఇద్ద‌ర‌మ్మాయిల‌తో సినిమా వ‌స్తుందా?  రాదా? అనే టెన్ష‌న్ తీరిపోయింది. అమ్మాయిలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యారు. ఈనెల 31న ఈ సినిమా రావ‌డం ఖాయ‌మైంది. శుక్ర‌వారం ఇద్ద‌ర‌మ్మాయిల‌తో సెన్సార్ ముందుకెళ్లింది. u/a సర్టిఫికెట్ ల‌భించింది.

రీషూట్ చేస్తార‌ట‌, వాయిదా వేస్తార‌ట‌.. అనే డౌట్లు ఇక వినిపించ‌వ్. మీడియాలో ఈ సినిమా వాయిదా వేస్తార‌ని వ‌చ్చిన క‌థ‌నాలు..పూరి అండ్ టీమ్‌లో క‌సిని పెంచాయ‌ట‌. ఈ సినిమా ఎట్టిప‌రిస్థితుల్లోనూ మే 31నే తీసుకురావాల‌ని గ‌ట్టిగా ఫిక్స‌య్యార‌ట‌. అందుకే... న‌ట్టూ, బోల్టూ బిగించే ప‌నిని ప‌క్క‌న పెట్టి... సెన్సార్ ముందుకు తీసుకెళ్తున్నారు. సినిమా అవుట్‌పుట్ పై మేం హ్యాపీగా ఉన్నాం. 31న ఈ సినిమా రావ‌డం ఖాయం.. అని గ‌ణేష్ చెబుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: