అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కల్యాణ్ చాలా అందంగా కనిపిస్తున్నాడు. చాలా రోజుల తరవాత.. పవన్ తన బాడీపై తీసుకొన్నాడు. ఆ శ్రద్ధ.. ఈ సినిమాలో అణువణువూ కనిపిస్తుందట. సమంత పక్కన.... భలే అందంగా కుదిరిపోయాడట. అంతే కాదు.. దేవి ఇచ్చిన మ్యూజిక్ కి చిన్న చిన్న మ్యాజిక్ల్ స్టెప్స్ వేశాడట. ఎమోషనల్ డైలాగుల్లో తన మార్క్ చూపించడానని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఈ సినిమా పతాక సన్నివేశాల్లో ఓ భారీ ఎమెషనల్ డైలాగ్‌ని సింగిల్ టేక్‌లో చెప్పేసి ఔరా అనిపించాడట. మొత్తమ్మీద ఒకప్పటి పవన్‌ని ఈ సినిమాలో మళ్లీ చూడబోతున్నాం... అని అత్తారింటికి దారేది యూనిట్ సంబరపడిపోతోంది. పవన్ అభిమానులకు ఇది నిజంగా గ్రేట్ న్యూసే.