ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా టైటిల్ మ‌ళ్లీ రిపేరులో ప‌డింది. ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. స‌మంత క‌థానాయిక‌. ఈ చిత్రానికి అత్తారింటికి దారేది అనే పేరు ప‌రిశీలిస్తుండ‌గానే... స‌మంత ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేసేసింది. నేను అత్తారింటికి దారేదిలో న‌టిస్తున్నానోచ్‌.. అనేసింది. దాంతో ఈ సినిమా టైటిల్ ఇదేన‌ని.. అంద‌రూ క‌న్‌ఫామ్ అయిపోయారు.

advertisements - Call 040 4260 1008



అయితే, ప‌వ‌న్ ఫ్యాన్స్ నుంచి ఈ టైటిల్‌కి మిక్స్‌డ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ప‌వ‌న్ కి ఇది సూట‌బుల్‌గా లేద‌ని అన్నారు. ఇంకొంత‌మంది క్లాసిక‌ట్ ట‌చ్ ఎక్క‌వైంద‌ని చెప్పారు. దాంతో.. ఈ టైటిల్‌కి ప్ర‌స్తుతం రిపేరు చేస్తున్నారు. టైటిల్ మారే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచారం. మ‌రో రెండ్రోజుల్లో కొత్త టైటిల్ ప్ర‌క‌టిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: