అనుకొన్నంతా జ‌రిగింది. 'రీ షూట్‌లు చేయ‌లేదు..' అని టీమ్ అంతా మొత్తుకున్నా... జ‌రిగింది అదేన‌ట‌. అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం... ఇద్ద‌ర‌మ్మాయిల‌తో క‌థ‌లో చాలా మంది వేలు పెట్టారు. క‌థ‌ని నానా ర‌కాలుగా మార్చేశారు. క్లైమాక్స్‌ని కెలికేశారు. ఇద్ద‌ర‌మ్మాయిల‌తో సినిమా విషాదంతం. అయితే... తెలుగులో యాంటీ క్లైమాక్స్ లు న‌డ‌వ‌వు. అందుకే ఈ సినిమా చూసిన వాళ్లంతా క్లైమాక్స్ మారిస్తే బాగుంటుంది క‌దా??  అని స‌ల‌హా ఇచ్చార‌ట‌. దాంతో... చివ‌ర్లో రీ షూట్ చేసి.. కొత్త ప‌తాక స‌న్నివేశాలు క‌లిపిన‌ట్టు సమాచార‌మ్‌. దాంతో పూరి అనుకొన్న‌దొక్కటీ చివ‌రికి తీసింది మ‌రోటి.

మ‌రి... ఈ ఫ‌లితం ఎలా ఉంటుందో మరి. ఈ శుక్ర‌వారం భారీ ఎత్తున ఇద్ద‌ర‌మ్మాయిల‌తో రిలీజ్ కానుంది. మొద‌టి ఆట ప‌డితే గానీ... ఈ కెలుకుడు క‌రెక్టా?  కాదా??  అనేది తెలీదు.

మరింత సమాచారం తెలుసుకోండి: